ప్రధాని మోడీ ఎన్నిక చెల్లెదా..? వచ్చే నెల 15న విచారణ..! plea challenging Modi’s election to continue on Nov 15

Plea challenging modi s election to continue on nov 15

narendra modi, prime minister, BJP, Ajay Rai, Congress, varanasi, elections, high court, plea, Politics News, india news

The Allahabad High Court fixed November 15 as the next date of hearing on a petition challenging the election of Prime Minister Narendra Modi from Varanasi.

ప్రధాని మోడీ ఎన్నిక చెల్లెదా..? వచ్చే నెల 15న విచారణ..!

Posted: 10/20/2016 02:02 PM IST
Plea challenging modi s election to continue on nov 15

దేశ ప్రధానిగా దాదాపు రెండున్నర సంత్సరాలుగా పదవి బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటీషన్ దాఖలైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నిలలో బీజేపి అభ్యర్థి నరేంద్రమోడీ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన అజయ్ రామ్ పై మూడు లక్షల 71 వేల ఓట్ల మోజారిటీతో గెలుపోందారు. అయితే మోడీ ఎన్నికల చెల్లనేరదని, మోడీ చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ రాయ్ అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

ఈ పీటీషన్ వచ్చే నెల 15న విచారిస్తామని అలహాబాద్ హైకోర్టు పిటీషనర్ కు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ తరపు కౌన్సిల్ సత్యపాల్ జైన్ వాదనలను పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం పిటీషన్ ను విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను భంగం కలిగించే ఇలాంటి పిటీషన్లను విచారణకు స్వీకరించడం బావ్యం కాదని మోడీ తరపు న్యాయవాది సత్యపాల్ జైన్ అన్నారు,. మోడీపై కేవ‌లం రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్యతోనే రాయ్ పిటిష‌న్ దాఖ‌లు చేశార‌ని, మోడీ ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ చూపిన కార‌ణాలు అసంబద్ధంగా ఉన్నాయ‌ని అన్నారు. వీటని స్వీకరించి న్యాయస్థానం తన సమయాన్ని వృధా చేసుకోరాదరని వీటిని అదిలోనే తుంచివేయాలని అయన చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వికే శుక్లా తోసిపుచ్చారు.

మోడీ ఎన్నిక చెల్లదంటూ అజయ్ రాయ్ దాఖలు చేసిన పిటీషన్ లో అనేక విషయాలను పొందుపర్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా మోడీ వ్యవ‌హ‌రించార‌ని, కాబ‌ట్టి వార‌ణాసి ఎంపీగా ఆయ‌న ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ అల‌హాబాద్ హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. రాయ్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు.. మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మోడీ చిత్రాలున్న టీషర్ట్ లను, పోస్టర్లను ఓటర్లకు పంచిపెట్టారని... ఇది ఓ విధంగా ఓటర్లకు లంచం ఇవ్వడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. కాబ‌ట్టి ఓట‌ర్ల‌ను ప్రలోభ పెట్టి మోడీ త‌న‌కు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నార‌ని, ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎన్నిక చెల్లదని వాదించారు. మొత్తానికి ఈ ప‌రిణామం మోడీకి షాక్ అంటున్నారు విశ్లేష‌కులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  prime minister  BJP  Ajay Rai  Congress  varanasi  elections  high court  plea  Politics News  india news  

Other Articles