పర్సులకు చిల్లులు పెట్టిన ఇంధనం ధరలు.. Petrol up Rs 1.34 a litre, diesel by Rs 2.37

Petrol price hiked by rs 1 34 per litre and diesel by rs 2 37 per litre

petrol price, petrol price hike, petrol price hike, petrol price hike today, diesel price, diesel price hike, diesel price today, international market, barrel price, oik companies, crude oil, india news, national news, business news

Petrol price was today hiked by Rs 1.34 a litre, the fifth increase in two months, and diesel by Rs 2.37 a litre on back of spike in global rates

పర్సులకు చిల్లులు పెట్టిన ఇంధనం ధరలు..

Posted: 10/15/2016 09:40 PM IST
Petrol price hiked by rs 1 34 per litre and diesel by rs 2 37 per litre

పెట్రోల్‌ ధరలు మళ్లీ వాహనదారులకు వాత పెట్టాయి, వారి పర్సులకు చిల్లులు పెట్టాయి. సామాన్యులపై భారం మోపుతూ మళ్లీ పెరిగాయి. ఇటీవల పదిపైసలు, ఇరవై పైసలు తగ్గినట్టు అప్పుడప్పుడు కనిపించినా ఇప్పుడు లీటరుపై ఏకంగా పెట్రోల్‌పై రూపాయికిపైగా, డీజిల్‌పై రెండు రూపాయలకుపైగా పెరగడం గమనార్హం. లీటరు పెట్రోల్‌ ధరపై రూ. 1.34లు పెరగగా.. డీజిల్‌పై ఏకంగా రూ. 2.37లు పెరిగాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.

సాధారణంగా  రెండు వారాలకు ఒకసారి  అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం రంగ ఇంధనసంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి),  భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ సుంకాలు ,అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ, చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు ఆధారంగా ఇది ఉంటుంది.

ఆయిల్ ధరలు పుంజుకోవడంతో దేశంలో మరోసారి పెట్రో వడ్డనే తప్పదనే సంకేతాలు ధరలు పెరుగడం గమనార్హం. అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా పెరగడంతో పెట్రోల్ ధరలు పెరగొచ్చనే అంచనా మార్కెట్ వర్గాల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మాసాంతంలో జరిగే సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  పెట్రోల్,  డీజిల్ భారీగానే పెంచే అవకాశం ఉందని ఇంతకుముందే భావించారు. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పుడు కూడా.. పది పైసలు, ఇరవై పైసలు తగ్గించి.. పెరిగినప్పుడు మాత్రం రూపాయి, రెండు రూపాయలు పెంచడాన్ని వినియోగదారులు తప్పుబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol price  petrol price hike  diesel price  diesel price hike  

Other Articles