ట్రాయ్ అదేశాలు.. కేబుల్ టీవీ ప్రసారాలపై టారిఫ్ TRAI proposes cap on HD channel tariffs, pay-and-pick menu

Trai proposes rs 130 monthly rental for 100 tv channels

TRAI, cable regulation, broadcast, cable tariff, right step, Analysts, Business, standard definition, channel, subscription, draft, tariff, Telecom Regulatory Authority of India, high definition

As per the proposal by TRAI, a monthly rental of Rs 130 has been proposed for accessing 100 standard definition TV channels, per set top box, per month.

ట్రాయ్ అదేశాలు.. కేబుల్ టీవీ ప్రసారాలపై టారిఫ్

Posted: 10/14/2016 09:44 AM IST
Trai proposes rs 130 monthly rental for 100 tv channels

దేశవ్యాప్తంగా కేబుల్ బ్రాడకాస్టర్స్ వసూలు చేసే కేబుల్ టారిఫ్ పై  ట్రాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాలవారికి ఇది వరంగా వుండగా, మరికోన్ని ప్రాంతాల వారీకి ఇది భారంగా మారనుంది. పలు రాష్ట్రాలలో వంద చానెల్లను ప్రసారం చేసినా కేబుల్ అపరేటర్లు సుమారుగా 130 రూపాయల బిల్లను మాత్రమే తీసుకుంటుండగా, ఈ నూతన నిర్ణయం ద్వారా పన్నుల భారం వినియోగదారులపై పడుతుంది. ఇక అనేక ప్రాంతాల్లో కేబుల్ అపరేటర్లు సుమారుగా 200 రూపాయలను వసూలు చేస్తుండగా, వారికి అదనపు చార్జీలపై ట్రాయ్ కత్తర పడనుంది.

కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో డిజిటలైజేషన్ కేబుల్ ధరలపై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలపై పరిమితిని విధించాలని ప్రతిపాదించింది. అధిక మొత్తాలను వసూలు చేయకుండా వంద చానళ్లను ప్రసారం చేసే సెట్ టాప్ బాక్స్ కు నెలకు రూ. 130 మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. దీనిపై పన్నులను అదనంగా వసూలు చేస్తారు. మొత్తంగా కలిపితే 150 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. కాగా ఈ నిబంధన కింద కచ్చితంగా 100 చానళ్లను కస్టమర్లకు అందించాల్సిందేనని తెలిపింది.

దీని ప్రకారం ప్రతి ప్రసార లేదా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో పే, ఫ్రీ ఛానల్స్ వివరాలను స్పష్టంగా ప్రకటించాలని కోరింది. ఇంకా ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం పలు శ్లాబ్ లను ప్రకటిస్తూ, రూ. 25 చొప్పున అదనంగా చెల్లించి ఆ చానళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. తమకు నచ్చిన చానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని దగ్గర చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు ట్రాయ్ అధికారి ఒకరు వివరించారు. డ్రాఫ్ట్ టెలి కమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్, 2016ను రిలీజ్ చేసిన ట్రాయ్ దీనిపై లిఖిత పూర్వక అభిప్రాయాలను అక్టోబర్ 24, 2016 లోపు తెలియజేయాలని కోరింది. మరోవైపు ట్రాయ్ ప్రతిపాదనలపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టెలికాం రెగ్యులేటరీ సరైన నిర్ణయం తీసుకుందని, కానీ పరిష్కరించాల్సిన  కొన్ని సమస్యలు  ఉన్నాయని పెట్టుబడి బ్యాంకు   అమెరికా మెర్రిల్ లించ్ పేర్కొంది. కేటగిరీలను స్పష్టంగా నిర్వచించిన లేదని తెలిపింది.  డిజిటైజేషన్ ఇప్పటికీ పూర్తి కాకలేదని, ఎవరెవరు ఎంతెంత చెల్లిస్తున్నారనేది క్లారిటీ లేదని పేర్కొంది. అలాగే ఈ కొత్త ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పిండానికి  సమయం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది.  అలాగే  ఈ ప్రతిపాదన నచ్చని  బ్రాడ్ కాస్టర్స్  కోర్టు కెళ్లి  స్టే  తెచ్చుకుంటారని అభిప్రాయపడింది.   ధర పరిమితి విధించడం  సహేతుకమైనదని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్  తెలిపింది. ట్రాయ్  ప్రతిపాదిత టారిఫ్  ముఖ్య లక్ష్యం వినియోగదారుల ఆసక్తిని   రక్షించుకోవడమేనని  పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRAI  cable regulation  broadcast  cable tariff  right step  Analysts  

Other Articles