మరో వివాదంలో చిక్కకున్న మంత్రి పంకజీ ముండే Pankaja Munde in fresh row over 'threat' audio clip

Maharashtra minister pankaja munde in fresh row over threat audio clip

minister Pankaja Munde, fresh controversy, Namdev Shastri Maharaj, Parli, Pankaja Munde audio clip, Pankaja Munde threatening clip, minister threatening priest, Bhagwangad hill shrine, Ahmednagar, punkaja munde dassera speech, minister dussera speech, Maharashtra

Maharashtra minister Pankaja Munde found herself embroiled in a fresh controversy after a purported audio clip appeared in which she is heard "threatening" a priest of the Bhagwangad hill shrine in Ahmednagar district to allow her to make a speech on Dussehra.

మరో వివాదంలో చిక్కకున్న మహిళా మంత్రి

Posted: 10/08/2016 05:32 PM IST
Maharashtra minister pankaja munde in fresh row over threat audio clip

మహారాష్ట్ర మహిళా మంత్రి పంకజ ముండేకు వివాదాలు కొత్తేమీ కావు. గతంలో అమె చెప్పులు మోసిన ఫోటో నుంచి తాజాగా అరెస్టు చేస్తామని బెదిరింపుల వరకు అమె చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. గతంలో రువు జిల్లా లాతురులో నదీ పునరుద్దరణ పనులు పర్యవేక్షించిన సందర్భంగా ఆమె ఎండిపోయిన నదీ ఒడ్డున నిల్చుని దిగిన ఫొటో సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. ఓ వైపు రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా సెల్ఫీలు దిగడం పూర్తిగా నిర్లక్ష్యమేనని విమర్శలొచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయినా వివాదాలు లేకపోతే ప్రజల్లో మనజాలమనుకుందో ఏమో తెలియదు కానీ మరమారు అమె వివాదంలో చిక్కుకున్నారు

ఆమె ఓ ప్రధాన ఆలయ పూజారిని, ఆయన మద్ధతుదారులను బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె నియోజకవర్గంలోని ఓ ఆలయంలో గతంలో ఆమె తండ్రి ప్రతి దసరా వేడుకలలో పాల్గొనేవారు. ఆ ప్రాంతం సమీపంలో రాజకీయ ప్రసంగాలు కూడా ఇచ్చేవారు. ఈ క్రమంలో వంజారీ కమ్యూనిటీకి చెందిన కొందరు ఆమెను భగవాన్ గడ్ లో దసరా వేడుకలలో పాల్గొనాలని కోరగా, మంత్రి మద్ధతుదారులు ఆలయ పూజారి వర్గంపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. తన తండ్రి దారిలో నడవాలని అమె భావించడంలో తప్పులేదు.. కానీ తండ్రికి కూడా చెడ్డ పేరును అపాదించే చర్యలు చేపట్టడంతో అసలు వివాదం రాజుకుంది. అమె తండ్రితో ఉన్న సన్నిహిత్యంమో లేక గౌరవమో అప్పట్లో అయనను రాజకీయ ప్రసంగానికి అనుమతించారు, కానీ అదే మాదిరిగా తాను చేస్తానని, లేకపోతే  మీపై అకారణంగా కేసులు బుక్ చేస్తామని మంత్రి పంకజ హెచ్చరించడం ఎంతవరకు సమంజసమో అమెకే తెలియాలి.

 పండగ వేళ నలుగురితో కలసి ఔరా అనిపించుకునేట్లుగా చేయాల్సిన మంత్రి వర్యులు కాస్తా.. ఇంకా పాతతరహాలోనే అలోచిస్తూ.. అదే విధానాన్ని అవలంభిస్తానని చెప్పడం, రాజకీయ ప్రసంగాలు చేస్తాను, అనుమతించకపోతే మీ పని పడతాను అంటే అది వివేకమేనా..? అమెకే తెలియాలి. ఇప్పుడీ అడియో టేపులు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో అమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయిఈ ఆడియో వివాదంపై ప్రధాన పూజారి నామ్ దేవ్ శాస్త్రిని జాతీయ మీడియా సంప్రందించగా.. దసరా వేడుకలలో ప్రసంగించేందుకు ఆమె నిరాకరించారని, మరికొన్ని పనులకు వారికి అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై మంత్రి పంకజ గానీ, బీజేపీ నేతలు గానీ నోరు మెదపకపోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత ధనంజయ్ ముండే మాట్లాడుతూ.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మంత్రి పంకజను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles