‘‘వేరు కాపురం’’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు Wife Separating Man From Parents Ground For Divorce says SC

Man can divorce wife if she tries to separate him from parents

Supreme Court, husband, parents, Marital law, cruelty, Divorce, Hindu Marriage Act, India divorce, Laws on divorce, India marriage, latest news, india news, latest legal news

A man can divorce his wife on the ground of cruelty if she forced him persistently to live separately from his aged parents, the Supreme Court has held.

‘‘వేరు కాపురం’’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted: 10/08/2016 08:01 AM IST
Man can divorce wife if she tries to separate him from parents

అమృతం తాగిన వాళ్లు దేవతలు, దేవుళ్లు, అది కన్నబిడ్డలకు పంచేవాళ్లు అమ్మానాన్నలు అంటూ తెలుగు సినీకవులు దేవుళ్ల కన్నా అమ్మానాన్నలే గొప్ప, వారి బిడ్డల పట్ల చూపించే అమితాసక్తి, ప్రేమ, అప్యాయత, అనురాగం, కరుణ అన్ని కూడా వెల కట్టలేనివని తెలిపాడు, ఇప్పుడంత ఉన్నఫలంగా తల్లిదండ్రుల అంశాన్ని ఎందుకు తీసుకువస్తున్నామంటే.. అందుకు కారణం లేకపోలేదు. ప్రతీ మనిషి తనకు పెళ్లి కాగానే భార్య పిల్లల కోసం శ్రమించడం అలవాటు చేసుకుంటాడు. ఈ క్రమంలో ఉద్యోగం కోసమో, లేక అత్తా కొడళ్ల మధ్య వివాదాలు తారాస్థాయికి వెళ్లడం వల్లనో గత్యంతరం లేని పరిస్థితుల్లో తనను కనిపెంచిన అమ్మా నాన్నలను వదిలి వేరు కాపురం పెడుతుంటాడు.

అయితే తల్లిదండ్రులను వదిలి వేరుకాపురం పెట్టాలని ఒక వేళ భార్యలు డిమాండ్ చేసిన పక్షంలో కన్నవారిని వదిలి రాలేక మనోవేధన చెందే భర్తలకు ఇప్పుడిక న్యాయ సహకారం కూడా లభించనుంది. గతంలో భర్తగా భార్యకు న్యాయం చేయాలన్న చట్టం అండ చూసుకుని భార్యమణులు వేరు కాపురానికి భర్తలను ఉసిగోల్పేవారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఉపశమనం ఇస్తూ.. భార్యలు తమ భర్తలతో బలవంతంగా వేరు కాపురం పెట్టించేందుకు ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలో ఆమెకు విడాకులు ఇవవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

‘హిందూ సమాజంలో తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడటం కుమారుడి ధర్మం. ఇది సర్వసాధారణ ప్రక్రియ’ అని తెలిపింది. భర్తను ఆయన తల్లి దండ్రుల నుంచి వేరు చేయాలని భార్య ప్రయత్నించడం ‘క్రూరత్వమే’ అని, అలాంటప్పుడు విడాకులు కోరవచ్చని తెలిపింది. జస్టిస్‌ ఏఆర్‌.దవే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కేసులో ఈ తీర్పు చెప్పింది. ‘కిందికోర్టు అతనికి ఇచ్చిన విడాకులు చెల్లవు’ అంటూ 2001లో కర్ణాటక హైకోర్టు చెప్పిన తీర్పును సుప్రీం ధర్మాసనం పక్కనపెట్టింది.

‘‘వేరుకాపురం పెడదామని భార్య కోరితే... తగిన కారణం ఉండి తీరాలి’’ అని ధర్మాసనం తెలిపింది. కని, పెంచి, చదివించిన తల్లిదండ్రుల బాగోగులను చూడటం కుమారుడి నైతిక, చట్టపర బాధ్యత అని పేర్కొంది. ‘మనం వేరుగా ఉందాం’ అనడం మన సంస్కృతికి, విలువలకు దూరం కావడమేనని, అది పాశ్చాత్య ధోరణి అని తెలిపింది. అంతేకాదు ఈ తరహా కేసులతో భర్తలకు దూరమైన భార్యలకు వారి భర్త నుంచి పరిహారం కోరే హక్కు కూడా లేదని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  husband  parents  India divorce  Laws on divorce  India marriage  

Other Articles