ఆ విషయంలో ఏలియన్స్ మనకన్నా ముందున్నాయి | China Hunts for Scientific Glory and Aliens With New Telescope

China hunts for scientific glory and aliens with new telescope

Stephen Hawking warns about Aliens, China Hunt for Aliens, China Contact for Aliens, China Huge Telescope, China Hunts for Scientific Glory and Aliens, Stephen Hawking about Aliens, Aliens most dangerous

Even though Stephen Hawking warns China Hunts for Scientific Glory and Aliens With New Telescope.

ఏలియన్స్ తో చాలా డేంజర్ అయినా పట్టించుకోరా?

Posted: 09/26/2016 09:27 AM IST
China hunts for scientific glory and aliens with new telescope

ఏలియన్స్ తో జాగ్రత్త అని బ్రిటీష్ భౌతిక శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోకే డ్రాగన్ కంట్రీ ప్రయోగాలకు సిద్ధమైపోయింది. ఓ భారీ టెలిస్కోప్ సాయంతో గ్రహాంతరవాసులను అన్వేషించేందుకు ప్రయోగానికి సిద్ధమైపోయింది. అన్వేషణకు 1.2 బిలియన్‌ యువాన్లు మన కరెన్సీలో రూ.12 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి రూపొందించిన భారీ టెలిస్కోప్‌ను చైనా ఆదివారం రంగంలోకి దించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ టెలిస్కోప్ దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో ఉంటుంది.

ఈ టెలిస్కోప్‌లో 4450 ప్యానెల్ రిఫ్లెక్టర్లను ఉపయోగించారు. వీటిని తయారుచేసేందుకు కంపెనీ చుట్టుపక్కల నివసిస్తున్న 8వేల మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. నిర్వాసితుల కోసం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో 600 అపార్ట్‌మెంట్లు కట్టి ఇచ్చారు. విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా? ఉంటే ఎక్కడ, ఏ రూపంలో ఉంది? అనే విషయాలను నిర్ధారించేందుకే ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. 2011లో భారీ టెలిస్కోప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన డ్రాగన్ కంట్రీ సరిగ్గా ఐదేళ్ల తర్వాత దానిని ప్రారంభించడం విశేషం.

China Huge telescope

కాగా,గ్రహాంత‌ర‌వాసుల సందేశానికి స్పందించ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వీల్ చైర్ కి పరిమితమైన ఈ 74 ఏళ్ల మేధావి హెచ్చ‌రించడం కొత్తేమీ కాదు. స్థానిక అమెరిక‌న్లు తొలిసారి కొలంబ‌స్‌ను చూసిన త‌ర్వాత ఏమైందో ఇదీ అలాంటిదేన‌ని ఆయ‌న అన్నారు. హాకింగ్ త‌న కొత్త ఆన్‌లైన్ ఫిల్మ్ స్టీఫెన్ హాకింగ్స్ ఫేవ‌రెట్ ప్లేసెస్‌లో ఈ హెచ్చరిక చేశారు. ఏలియన్స్.. మ‌న‌కు 16 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో అచ్చూ భూమిలాంటి గ్ర‌హంగా ఉన్న‌ గ్లీజ్ 832సీని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకొని హాకింగ్ గ్ర‌హాంత‌ర‌వాసుల‌తో వ‌చ్చే ప్ర‌మాదాన్ని వివ‌రించారు. 'గ్లీజ్ 832సీలాంటి గ్ర‌హం నుంచి ఏదో ఒక రోజు మ‌న సిగ్న‌ల్ అందుకోవ‌చ్చు. అయితే దీనికి స్పందించ‌డం మాత్రం ప్ర‌మాద‌మే. వాళ్లు మ‌న‌క‌న్నా చాలా శ‌క్తిమంతులు కావ‌చ్చు.

Stephen Hawikg warns again Aliens

మ‌నం బ్యాక్టీరియాను ఎలా చూస్తామో.. మ‌న‌ల్ని వాళ్లు అలాగే చూసే ప్ర‌మాదం ఉంది' అని హాకింగ్ హెచ్చ‌రించాడు. విశ్వంలో మ‌నం ఒంట‌రివాళ్లం కాద‌ని, ఎక్క‌డో ఓ చోట జీవం ఉంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు మ‌రింత ఎక్కువైందని ఆయ‌న చెప్పారు. మ‌న సందేశాల‌ను స్వీక‌రించే గ్ర‌హాంత‌ర‌వాసులు మ‌న‌కంటే కొన్ని వంద‌ల కోట్ల ఏళ్ల ముందే ఉండొచ్చ‌ని ఆయ‌న అన్నారు. మ‌నుషుల కంటే ఎంతో అత్యాధునిక టెక్నాల‌జీ క‌లిగి ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aliens  Stephen Hawking  warns  China  Huge Telescope  

Other Articles