కాపుల డిమాండ్లను నెరవేర్చాల్సిందే.. బాబుకు మరోమార్గం లేదు.. mudragada challenges chandrababu for hunger strike on special status

Mudragada says chandrababu should fulfill kapus demands

mudragada etter to ap government, mudragada letter to babu, mudragada letter to chandrababu, hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, tuni violence, mudragada padmanabham, mudragada hunger strike, NTR, balakrishna, YS Rajashekar reddy

Kapu caste leader Mudragada padmanbham alleges that andhra pradesh government tourched him while he is in indefinate hunger strike

కాపుల డిమాండ్లను నెరవేర్చాల్సిందే.. బాబుకు మరోమార్గం లేదు..

Posted: 09/25/2016 08:04 AM IST
Mudragada says chandrababu should fulfill kapus demands

కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి తన శక్తికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమానికి మద్దతునిచ్చిన పార్టీలను, రాజకీయ నేతలపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టిందని ఆయన తూర్పారబట్టారు. కావు ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మద్దతునిచ్చాయని చంద్రబాబు సర్కార్ ప్రశ్నించే తీరుపై ఆయన మండిపడ్డారు. కాపులే కావు ఉద్యమానికి మద్దత్తునివ్వాలా..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో పత్రిపక్ష నేతగా వున్న సయయంలో తన బావమరిదిని రక్షించుకోవడానికి, ఆయన్ను చట్టం ఉచ్చు నుంచి తప్పించడానికి దిగజారిపోలేదా అని విమర్శించారు.

కాపు ఉద్యమం పుట్టిందే చంద్రబాబునాయుడి వల్లనే అని, ఉద్యమానికి మూల కారకుడు ఆయనేనని ముద్రగడ వ్యాఖ్యానించారు. "మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయి. ఎప్పుడూ నోటి నుంచి రాని పదాలు కూడా వస్తున్నాయి. మీరు మహా అయితే నన్ను ఆపేందుకు ఆఖరి అస్త్రంగా నా బట్టలు ఊడదీయించి, పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారు. నన్నేమైనా చేసుకోండి. గతంలో మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనని.. అప్పటిదాకా ఊరుకోబోను" అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధైర్యముంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమరణ దీక్షకు దిగాలని ముద్రగడ సవాల్ విసిరారు. హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తే, తాను కూడా ఆ క్షణం నుంచి దీక్షను ప్రారంభిస్తానని, చంద్రబాబు పక్కనే కూర్చుంటానని చెబుతూ, అప్పుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరో, ఎవరి సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. తాను చేస్తున్న దీక్షలను దొంగదీక్షలన్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉప్పుడు చంద్రబాబు కూడా దీక్షలు చేశారని గుర్తు చేసిన ఆయన, అవి కూడా దొంగ దీక్షలేనా? అని ప్రశ్నించారు. సమాజంలో వెనుకబడిపోయిన కాపుల భవిష్యత్తు బాగుండాలని తాను ఉద్యమాలు చేస్తుంటే, వాటిని అణచి వేయాలన్న ఉద్దేశంతో కాపులతోనే తనను తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padmanabham  chandrababu  ap government  balakrishna  hindupuram  andhra pradesh  

Other Articles