గవర్నర్ పై మంత్రి ఎదురుదాడి.. తనతో అసుపత్రులకు రావాలని డిమాండ్ Delhi Health Minister Jain attaks Lt Governor

Talk to me says delhi health minister after lt governor s rap

Delhi's Health Minister Satyendar Jain, Delhi, Deputy CM, Manish Sisodia, Finland, Study tour, Delhi Lieutenant Governor, Najeeb Jung, Dengue, Chikungunya, aravind kejriwal, baghoda divas, bengaluru, chronic cough, surgery

Delhi's Health Minister Satyendar Jain has attacked Lieutenant Governor Najeeb Jung for ordering Manish Sisodia to cut short Finland visit and return to delhi, which is in the grip of a massive chikungunya and dengue outbreak.

గవర్నర్ పై ఎదురుదాడి.. అసుపత్రులకు రావాలని మంత్రి డిమాండ్

Posted: 09/17/2016 01:57 PM IST
Talk to me says delhi health minister after lt governor s rap

ఉపముఖ్యమంత్రిని తన పర్యటనను రద్దు చేసుకుని స్వదేశానికి సాధ్యమైనంత త్వరగా తిరిగిరావాలని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అదేశించడంపై అరోగ్యశాఖ మంత్రి ఎదురుదాడికి దిగారు. దీంతో అప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు మధ్య మళ్లీ వివాదం రాజుకున్నట్లయ్యింది, గతంతో అప్ అధినేత, ముఖ్యమంత్రి కేజ్రవాల్ తో తారాస్థాయిలో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో కేంద్రం చెప్పినట్లు గవర్నర్ తన పనులనను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో ఆయన తప్పేమీ లేదని చెప్పిన తరువాత కూడా అప్పడప్పుడూ గవర్నర్ తన ఉనికిని చాటుకుంటేనే వున్నారు.

కాగా తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబులతున్న తరుణంలో పాలనాధీశులైన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి లేకపోవడంతో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను తన విదేశీ పర్యటనను తక్షణం రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగిరావాల్సిందిగా గవర్నర్ అదేశించారని సమాచారం. అయితే తాను జల్సా చేయడానికి ఫిన్ లాండ్ రాలేదని, ఫిన్ లాండ్ లో అమలు చేస్తున్న విద్యావిధానం బేషుగ్గా వుండటంతా దానిని అధ్యయనం చేయడానికి వచ్చానని మనీష్ సిసోడియా ఘాటుగానే బదులిచ్చారు.

ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ తన దీర్ఘకాలిక దగ్గతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు అస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని రోజుల పాటు మౌనంగా వుండాలని కూడా అస్పత్రి వైద్యులు అయనకు సూచించారు. ఈ తరుణంలో సీఎం, ఢిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు అందుబాటులో లేకుండా పోవడాన్ని చూపూతూ కాంగ్రెస్ భగోడా దివాస్ ను కూడా నిర్వహించింది. ఇక పలు విపక్షాలు ప్రభుత్వం పారిపోయిందని విమర్శలు కూడా సంధించాయి.

ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఢిల్లీ అరోగ్య శాఖామంత్రి సత్యేందర్ జైన్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై ఎదురుదాడికి దిగారు. తన శాఖకు సంబంధించిన అంశంలో తనకు సూచనలు, అదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్ ఉపముఖ్యమంత్రిని ఎందుకు పర్యటనను రద్దు చేసుకోవాలని అదేశిస్తున్నారని డిమాండ్ చేశారు. నిజంగా ప్రజల అరోగ్యం పట్ల గవర్నర్ కు చిత్తశుద్ది వుంటే కార్యాలయంలో కూర్చుని అదేశాలు ఇవ్వడం మానుకుని.. తనతో పాటు అసుపత్రులలో పర్యటించి.. రోగుల బాధలు, అవస్థలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. జనసాంధ్రత అధికంగా వున్న కారణంగా ప్రబలుతున్నాయిన సత్యేందర్ జైన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Deputy CM  Manish Sisodia  Finland  Study tour  Delhi Lieutenant Governor  Najeeb Jung  Dengue  Chikungunya  

Other Articles