అస్తమించిన దళిత ప్రజ అశాకిరణం.. civil rights leader bojja tarakam passes away

Civil rights leader and famous lawyer bojja tarakam passes away

bojja tarakam, civil rights leader bojja tarakam, popular lawyer bojja tarakam, famous lawyer bojja tarakam, bojja tarakam passes away, bojja tarakam no more, bojja tarakam died

Senior advocate and rights activist Bojja Tarakam died after brief illness here on Friday. He was 77. Bojja was suffering from brain tumor since 2007.

అస్తమించిన దళిత ప్రజ ఆశాకిరణం.. బొజ్జా తారకం

Posted: 09/17/2016 12:36 PM IST
Civil rights leader and famous lawyer bojja tarakam passes away

ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, పౌర హక్కుల సంఘం నాయకుడు, ధళిత వర్గాల అశాకిరణం బొజ్జా తారకం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారొగ్యంతో బాధపడుతున్న ఆయన హైధరాబాద్ లోని అశోక్ నగర్లో గల తన స్వగృహంతో పరమపదించారు. దళిత, వామపక్ష ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లపై కేసులో నమోదుచేసి విచారణ జరపాలంటూ పౌరహక్కుల నేత బొజ్జా తారకం సుప్రీంకోర్టులో పోరాడి గెలిచారు.

ప్రముఖ కవి బోయి భీమన్నకు బొజ్జా తారకం అల్లుడు. ఆయనకు భార్య విజయశాంతి, కుమారుడు రాహుల్ బొజ్జా, కుమార్తె మహిత ఉన్నారు. ఐఏఎస్ అధికారి అయిన తనయుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం హైదరాబాదు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శకుల కోసం ఉంచనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. బొజ్జా తారకం మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్సార్ సిపీ అధ్యక్షుడు జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు. విరసం నేత వరవరరావు, 'కమిటీ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్' సభ్యుడు రవీంద్రనాథ్, ఇతర ప్రముఖులు బొజ్జా తారకం మృతిపై సంతాపం ప్రకటించారు.

1939లో తూర్పుగోదావరి జిల్లా కందికుప్ప, బొజ్జవారిపేటలో జన్మించిన తారకం చిన్ననాటి నుంచి తన వర్గ ప్రజల పక్షాన నిలిచాడు. కాకినాడలో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన అనంతరం తన వర్గ ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. అనాటి నుంచి ధళిత వర్గాల అభ్యున్నతికి పాటుపుతూ.. దళిత ప్రజల పక్షాన నిలిచారు. 1968లో విజయభారతిని వివాహం చేసుకున్నారు. ఆమె నిజామాబాద్‌లో ఉద్యోగం చేస్తుండడంతో కాపురాన్ని అక్కడికి మార్చారు. అనంతరం నిజామాబాద్‌లో పదేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1978లో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శివశంకర్ వద్ద పనిచేశారు. నాలుగు దశాబ్దాలపాటు ప్రజా, న్యాయపోరాటాన్ని సాగించారు. చుండూరు, కారంచేడు, వేంపెంట, లక్ష్మీపేట బాధితులకు ఆయన ఆసరాగా నిలిచారు. మానవహక్కులు, దళిత, వామపక్ష ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణళికకు శ్రీకారం చుట్టారు. భూస్వాములపై తిరుగుబాటు, అంటరానితనం నిర్మూలనే ధ్యేయంగా పనిచేశారు. నిజామాబాద్‌లో అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించారు. అనంతరం యువజన సంఘాన్ని హైదరాబాద్‌కు విస్తరించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో ఏడాదిన్నర పాటు చంచల్ గూడ జైలులో ఉన్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్లపై సుప్రీంలో వాదించిన ఘనత సొంతం చేసుకున్న బొజ్జా తారకం రచయితగానూ తానేంటో నిరూపించుకున్నారు. ఆయన రాసిన ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’ అనే పుస్తకానికి మంచి గుర్తింపు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bojja Tarakam  rights activist  leader of scs and sts  passed away  renowned lawyer  

Other Articles