ప్రధాని జన్మదినాన భారత్ పేరిట గెన్నీస్ రికార్డుల పంట Amit Shah Pitched For Celebrating PM Modi's Birthday As 'Sewa Divas'

Narendra modi s september 17 birthday celebrations aim for four records

Narendra Modi, modi birthday, Guinness Book of Records, Gujarat, physically handicapped, deaf, BJP, Prime Minister modi, PM narendra modi, modi gujarat, modi birthday, narendra modi birthday, gujarat modi, modi news

Celebrations in connection with Prime Minister Narendra Modi's 66th birthday on September 17 at Navasari district in Gujarat will aim to set three Guinness World Records and one at the national level

ప్రధాని జన్మదినాన భారత్ పేరిట గిన్నీస్ రికార్డుల పంట

Posted: 09/16/2016 09:19 AM IST
Narendra modi s september 17 birthday celebrations aim for four records

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 66 వ పుట్టిన రోజున భారత్ మూడు గిన్నిస్ రికార్డులను లిఖించుకునేందుకు కూడా ఏర్పాటు చేసింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గత రెండు జన్మదినానికి లేని కొత్త ఏర్పాట్లను బీజేపి చేస్తుంది. ఇప్పటి వరకు పాశ్చాత దేశాల పేరిట వున్న గిన్నీస్ రికార్డును భారత్ తన పేరున లిఖించాలని భావిస్తుంది. అది కూడా సంక్షేమ కార్యక్రమాలతో ఈ మూడు గిన్నీస్ రికార్డును నెలకొల్పేందుకు బీజేపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో మూడు గిన్నిస్ రికార్డులతో పాటు ఒక జాతీయ రికార్డు ఉన్నాయి. వేడుకలు గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో నిర్వహిస్తారు.  

త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న గుజరాత్ రాష్ట్రాన్ని ఇందుకు వేదికగా చేసుకుంది బీజేపి అధిష్టానం. అర్ఎస్ఎస్ అదేశాల నేపథ్యంలో గుజరాత్ లో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని.. ఇక్కడ అధికారాన్ని కొల్పోతే.. దాని ప్రభావం దేశవ్యాప్తంగా వుంటుందని హెచ్చిరించిడంతో అందుకు అనుగూణంగా పావులు కదుపుతున్న బీజేపి వికలాంగులకు సాయం అందించడంతో పాటు పనిలో పనిగా వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కూడా చేయనుంది. సెప్టెంబర్ 17 న మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని నవ్సారీలో మొత్తం 11,223 మంది వికలాంగులకు 17,000 వీల్‌చైర్లు, మూడు చక్రాల సైకిళ్లను ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.7.5 కోట్లను ఖర్చు చేయనున్నారు.  

10000 మంది వికలాంగులకు వీల్ చైర్లు, మరో వెయ్యి మంది వినికిడిలోపం గల వారికి హియరింగ్ మిషిన్లను ఒకే సారి  పంపిణీ చేస్తారు. అనంతరం 1500 మంది దివ్యాంగులతో కలిసి దీపాలతో ర్యాలీగా ప్రదర్శనను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 346 మందికి  శారీరక వికలాంగులకు వీల్ చైర్లను అమెరికా అందించగా, ఆస్ట్రేలియా 500 మందికి వినికిడి యంత్రాలను అందించిన రికార్డు ఆయా దేశాల పేరుతో ఉంది. దీంతో ఇప్పటి వరకూ ఆయాదేశాల పేరుతో ఉన్న గిన్నీస్ రికార్డు బద్దలు కానుంది. ఇక ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని కూడా సేవా దివాస్ గా పాటించనున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  modi birthday  Guinness Book of Records  Gujarat  physically handicapped  deaf  BJP  

Other Articles