రికార్డు ధర పలికిన బాలపూర్ లడ్డూ.. balapur ganesh laddu auctioned for record prize

Balapur ganesh laddu auctioned for record prize

balapur laddu, balapur laddu auction, balapur laddu skylab reddy, ananth chturdhi, ganesh nimmajjanam, ganesh immersion, vinayaka visarjan, balapur ganesh, khairatabad ganesh, telugu states, police department, state officials, bhagyanagar ganesh ustav commitee

balapur ganesh laddu auctioned for record prize, which was owned by skylab reddy at a cost of 14.65 lakhs in a competition with 16 memebers

ITEMVIDEOS: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

Posted: 09/15/2016 10:09 AM IST
Balapur ganesh laddu auctioned for record prize

ఎప్పుడెప్పుడా అంటూ ఏడాది కాలంగా ఎదరుచూసే భక్తులు అమితాసక్తి మధ్య బాలాపూర్ లడ్డూ వేలం పాట ఇవాళ జరిగింది. రియల్ భూమ్ అధికంగా వున్న సమయంలో రికార్డు ధర పలికిన లడ్డూ.. ఈ సారి కూడా రికార్డు సొంతం చేసుకుంది. గత ఏడాది కంటే ఈ సారి నాలుగు లక్షల రూపాయల పైచిలుకు అధికంగా పలికింది. నువ్వా-నేనా అన్నట్లుగా పలువురు పోటీదారుల మధ్య సాగిన పోటీలో చివరకు ఈ లంబోధరుడి లడ్డూ ఏకంగా 14 లక్షల 65వేలు పలికింది. హోరా హోరీ వేలంపోరులో  స్కైలాబ్ రెడ్డి పెద్దమొత్తంలో వేలంపాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు.

బాలాపూర్ లడ్డూ వేలం పాటలో 25మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 16మందితో పాటు కొత్తగా మరో 9మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు.  చివరకు గణేష్ లడ్డూ స్కైలాబ్ రెడ్డిని వరించింది. గత ఏడదాది రూ.10.32 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి 4 లక్షల 33వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిసందే.  పదిలక్షలకు ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది.

బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు  బాలాపూర్ వాసులు. లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles