మంత్రిపై బూటు విసిరిన విపక్ష ఎమ్మెల్యే.. shoe hurled at minister in assembly

Akali dal mla criticised for derogatory remarks against dalits

dalits, derogatory remarks, shoe hurls, minister Bikram Singh Majithia, Punjab assembly, Tarlochan Soondh, MLA Virsa Singh Valtoha, Dalit communities

MLA Virsa Singh Valtoha not only abused Congress MLA Tarlochan Singh Soondh but also two particular Dalit communities which provoked the Congress member to hurl shoe at him.

మంత్రిపైకి బూటు విసిరన విపక్ష ఎమ్మెల్యే..

Posted: 09/14/2016 07:30 PM IST
Akali dal mla criticised for derogatory remarks against dalits

అధికార పక్షానికి చెందిన సభ్యులు తమ డిమాండ్ మేరకు స్పందించకుండా కేవలం ఏకపక్షంగా సభను నిర్వహిస్తున్నారని.. ఈ నేపథ్యంలో విపక్షానికి చెందిన సభ్యుడు అధికార పక్ష సభ్యుడు, రెవెన్యూ మంత్రిపైకి తన భూటును విసరడం కలకలం రేపుతోంది. ఈ హఠాత్పరిణామంతో పంజాబ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. మినిస్టర్ బిక్రమ్ సింగ్ మజీతియా పైకి శాసనసభలోనే 'షూ' విసరడం సంచలనంగా మారింది. తర్లోచన్ సూంధ్ అనే కాంగ్రెస్ చట్ట సభ్యుడు తమ పార్టీ నిరసనల సందర్భంలో సభలో తన షూ విప్పి మంత్రిపైకి విసరడం పంజాబ్ అసెంబ్లీలోనే కొత్త పోకడలకు దారి తీసింది.

రాష్ట్రంలోని అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై చర్చకు డిమాండ్ చేస్తున్న సందర్భంలో సూంధ్.. మంత్రిపైకి 'షూ' విసరడం ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తంగా మారింది. వాయిస్ ఓటు ద్వారా వారి డిమాండ్ ను తిరస్కరించినట్లు ప్రకటించడంతో సుమారు 22 మంది సభ్యులు సోమవారంనుంచీ అసెంబ్లీ భవనాన్ని విడిచి వెళ్ళలేదు. కాగా సదరు కాంగ్రెస్ సభ్యుడిని ఇప్పటికే తీవ్రవాది అని సంచలన వ్యాఖ్యలు చేసిన అధికార సభ్యుడు విర్సా సింద్ వల్హోత్రా.. ఆయనతో పాటు దళిత సంఘాలను కూడా తీవ్రవాదులుగా పరిగణిస్తూ వ్యాఖ్యలు చేయడం పంజాబ్ లో దుమారాన్ని రేపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles