నేరం రుజువైతే.. ఆ ఇద్దరు నటులకు మూడేళ్ల జైలు.. Kapil Sharma, Irrfan Khan may spend upto 3 years in jail

Kapil sharma irrfan khan may spend upto 3 years in jail

kapil sharma, irrfan khan kapil sharma, irrfan khan booked, kapil sharma case, kapil sharma tweet, kapil sharma bmc, kapil sharma mumbai police,3 years jail, illegal extensions, mumbai, bollywood, kapil sharma building, irrfan khan, kapil sharma modi

Kapil Sharma and Irrfan Khan have been booked under sections of the Mumbai Regional and Town Planning (MRTP) Act for alleged illegal extensions.

ఇద్దరు నటులకు మూడేళ్ల జైలు.. నేరం రుజువైతే..

Posted: 09/13/2016 09:36 AM IST
Kapil sharma irrfan khan may spend upto 3 years in jail

ముందస్తు అనుమతులు లేకుండా, తమ ఇష్టానుసారం తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇద్దరు నటులు చిక్కులను కొనితెచ్చుకున్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కమెడియన్ కపిల్ శర్మ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందన్న వార్తలు తాజాగా బాలీవుడ్ వర్గాలను అందోళనకు గురిచేస్తున్నాయి. తమ ప్లాట్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాల నేపథ్యంలో ఈ ఇద్దరు నటులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో వారి అభిమాన వర్గాలు అందోళన చెందుతున్నాయి.

దోషులుగా తేలితే వీరికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయవర్గాలు ప్రకటించాయి. ఈ ఇద్దరు నటులు ముంబైలోని గోరేగావ్‌ బిల్డింగ్‌లోని డీఎల్‌హెచ్‌ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. అపార్ట్‌మెంటులోని 9వ అంతస్తులో కపిల్‌ శర్మ, ఐదో అంతస్తులో ఇర్ఫాన్‌ ఖాన్‌ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గురించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరిద్దరితో పాటు మొత్తంగా 15 మంది అక్రమంగా నిర్మాణాలు జరిపిందని గుర్తించిన నగర పాలక సంస్థ వారిపై చర్యలకు కూడా ఉపక్రమించింది.

అపార్టుమెంట్లలో చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై పీ-సౌత్ వార్డ్ సబ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అపార్ట్ మెంట్ యజమాని, ఫ్లాట్ ఓనర్లపై మహారాష్ట్ర రీజినల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్(ఎంఆర్ టీఎస్) 1996 కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారికి నెల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 వేలు నుంచి రూ.5 వేలు జరిమానా విధిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapil sharma  irrfan khan  3 years jail  illegal extensions  mumbai  bollywood  

Other Articles