కొత్త బాదుడు బాగుందనట.. రైల్వేశాఖ సమర్థింపు.. Railways Defends 'Flexi Fares', Says Cheaper Than Flights

Railways defends flexi fares says cheaper than flights

indian railways, irctc, irctc.co.in, railway ticket price hike, train ticket, flexi fare

Despite receiving flak from commuters and a section of analysts, Indian Railways said surge pricing, won’t be rolled back, but added that the scheme won’t be extended to other trains for the time being.

కొత్త బాదుడు బాగుందట.. రైల్వేశాఖ సమర్థింపు..

Posted: 09/12/2016 12:53 PM IST
Railways defends flexi fares says cheaper than flights

ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు అన్ని పార్టీలకు బాగానే గుర్తుకు వస్తారు. తాము అధికారంలోకి వస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతారు. కానీ అధికారం కైవసం చేసుకుని దర్పం అందగానే ఒక్కసారిగా మారిపోతారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్తు గడుస్తున్న ఇంకా విద్యుదీకరణ జరగని గ్రామాలు అనేకం వున్నాయంటూ ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న పాలకులు..  దేశంలో రైల్వేలు ప్రవేశపెట్టడం వెనుకు వున్న ఉద్దేశ్యాన్ని పరమార్థాన్ని మర్చిపోతున్నారు. పైపెచ్చు.. తమ శాఖ ప్రజలపై మోపుతున్న అదనపు భారాలను అవే సమర్ధించుకుంటూ.. విమానా చార్జీలకు కన్నా నయమేగా అనడం విస్మయానికి గురిచేస్తుంది.  

దేశంలో 70 శాతం మంది పేదలు, మధ్య తరగతి ప్రజల రవాణా కోసం వినియోగించే ఏకైక రవాణా సౌకర్యం రైల్వే. ఎన్నో కోట్ల మందిని నిత్యం వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. రైల్వేలను లాభాల కోణంలో చూడటం ఆరంభం కూడా అప్పుడే ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా రైల్వే సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయాణికులపై భారం మోపడంతో పాటు వస్తు రవాణా, సరుకు రవాణాలతో ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. అయితే యూపీఏ హయంలో స్వల్పంగానే పెరిగిన రైల్వే చార్జీల ధరలు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా అదే ఒరవడిన నడుస్తుంది. రైల్వేలను పేదవాడి రవాణా సౌకర్యంగా అభివర్ణించిన నేతలు లేరు. ఇప్పుడంతా ఆదాయంపైనే దృష్టి. దీంతో పేద, మద్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన మరో బాదుడు విధానమే. ఫ్లెక్సీ-ఫేర్. ఈ విధానం ప్రవేశపెట్టడంపై వ్యక్తమవుతున్న అందోళనను పరిగణలోనికి తీసుకోని భారతీయ రైల్వే.. తమ విధానం పట్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు సమర్థించుకుంది. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ విధానాన్ని రద్దు చేసుకునే ఉద్దేశం లేదని కూడా తేల్చిచెప్పింది. ఇక దీంతో పాటు ఇప్పుడప్పుడే తమ విధానం అన్ని రైళ్లకు విస్తరించే అవకాశం లేదంటూనే.. భవిష్యత్తులో అన్ని రైళ్లకు దీనిని వర్తింపజేయడానికి యోచిస్తుందని సమాచారం.

ఫ్లెక్సీ-ఫేర్. విధానాన్ని డిమాండ్‌ను బట్టి రైలు టికెట్ల ధరలు పెంచుతున్నా ఇప్పటికీ విమాన చార్జీల కంటే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. అంటే ఈ విధానం ద్వారా రైల్వేశాఖ టిక్కెట్లు విమానయానాన్ని తాకుతాయని అర్ధం చేసుకోవాలా అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి. గత రెండు రోజుల్లో 30 శాతం బుకింగ్స్ ఈ విధానం ద్వారా వచ్చాయని రైల్వేశాఖ తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ నెల 9 నుంచి ఫ్లెక్సీ-ఫేర్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 500 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా రైల్వే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తొలి పదిశాతం టికెట్లను సాధారణ ధరకే విక్రయిస్తారు. ఆ తర్వాతి నుంచి ప్రతీ పదిశాతం టికెట్లకు పదిశాతం చొప్పున 50 శాతం వరకు ధర పెంచుకుంటూ పోతారు. ఈ సరికొత్త విధానం ద్వారా 9, 10 తేదీల్లో వరుసగా రూ.84, రూ.81 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్టు రైల్వే బోర్టు మెంబర్(ట్రాఫిక్) జంషెద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railways  irctc  irctc.co.in  railway ticket price hike  train ticket  flexi fare  

Other Articles