ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎన్నికలలో నటి ప్రియాంక చోప్రా.. Uproar over Priyanka Chopra pic in ABVP hoardings at Delbi university

Uproar over priyanka chopra pic in abvp hoardings at delbi university

DUSU polls, DU, Priyanka Chopra, Priyanka Chhawri, Satyawati College, ABVP, priyanka chopra posters, delhi university elections, priyanka chopra du elections

The poster of actress Priyanka Chopra has a number 4 written on it, which is the ballot box number of the ABVP candidate Priyanka Chhawri.

ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎన్నికలలో నటి ప్రియాంక చోప్రా..?

Posted: 09/08/2016 02:36 PM IST
Uproar over priyanka chopra pic in abvp hoardings at delbi university

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలలో బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్పా పోటీ చేస్తుందా..? లేదంటే ఏ అభ్యర్థి తరుపునైనా ప్రచారం చేస్తుందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణం బీజేపి అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ పోస్టర్లు, హోర్డింగులపై అమె చిత్రాన్ని ప్రచురించడమే. నిన్న మొన్నటి వరకు ఆ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్, సహా పలువురు విద్యార్థుల విషయంలో వార్తల్లోకి ఎక్కిన యూనివర్శిటి.. ఈ సారి అక్కడి ఎన్నికలలో ప్రియాంక చోప్రా ఫోటోలు వెల్లువెత్తడంతో పతాకశీర్షికలలో నిలిచింది.

అయితే ఈ వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించనున్న నేపథ్యంలో.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వర్గానికి చెందిన స్టూడెంట్ యూనియన్ తమ ఎన్నికల ప్రచార పోస్టర్లపై  ప్రియాంక చోప్రా ఫొటోలను వినియోగించారు. అసలు విషయం ఏంటంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు ప్రియాంక చౌరీ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్నాడు.

ప్రియాంక పేరు కలిసొస్తుందని ప్రియాంక చౌరీ తమ ప్రచారం పోస్టర్లపై హీరోయిన్ ఫొటో వాడుతున్నారు. గతంలోనూ వర్సిటీ ఎన్నికల్లో భాగంగా సెలబ్రిటీల ఫొటోలతో వాల్ పోస్టర్లు అంటించారు.  'ఆల్ ద బెస్ట్ ప్రియాంక 4 ఇమ్మీస్' అని ప్రియాంక చౌరీ బ్యాలెట్ నెంబర్ 4ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఏబీవీపీ జాతీయ మీడియా కన్వినర్ సాకేత్ బహుగుణను ప్రశ్నించగా.. తాము హీరోయిన్ పోస్టర్లతో ప్రచారం చేయలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DU dehi university  DU elections  DUSU  priyanka chopra  ABVP  Priyanka Chhawri  

Other Articles