కాపులకు మద్దుతుపై భూమన పునరుద్ఘాటన.. బాబు లిస్టులో వున్నందుకే.. Bhumana alleges politicall vendetta by chandrababu government

Bhumana karunakar reddy alleges politicall vendetta by ap government

bhumana karunakar reddy, Ysrcp former mla, cid office, ap govt, tuni incident, bhumana call data, mudragada padmanabham, bhumana appears before cid office, bhumana cid officials tdp govt, ap govt, tuni incident, bhumana call data, mudragada, tollywood news, telugu news

YSR Congress leader Bhumana Karunakar Reddy was questioned for about six hours by Regional CID officials in Guntur in connection with Tuni incident alleges Tdp government political vendetta after release.

కాపులకు మద్దుతుపై భూమన పునరుద్ఘాటన.. బాబు లిస్టులో వున్నందుకే..

Posted: 09/06/2016 06:49 PM IST
Bhumana karunakar reddy alleges politicall vendetta by ap government

కాపుల ఓట్లతో అందలం ఎక్కి.. వారిని ఎన్నికల ముందు అనేక హామీలను గుప్పించి.. ఒక్క దానిని కూడా నిజాయితీగా నెరవేర్చకపోవడంతో.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సభకు తాము మద్దతు ఇవ్వడం వల్లే తమపై అనవసర కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అరోపించారు. తమను ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కాపులకు మద్దతు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చారు.

సిబిఐ మళ్లీ తనను రేపు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పిందని, దీంతో తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని చెప్పారు. తనను ఎంత భయపెట్టినా.. బెదిరేది లేదని, తనకు సంబంధం లేని కేసులో తనను విచారణకు పిలవడం దారుణమన్నారు, తుని విధ్వంసం ఘటనలో తనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణకు పిలిపించడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యమమూ ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతివంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించారని భూమన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన అసలు నైజాన్ని బయటపెట్టారని, దీంతో కాపు కులస్థులు అయన తిరగబడుతున్నారని అరోపించారు, కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మారుతున్నాయని మండిపడ్డారు, చంద్రబాబుకు కాపులకు మధ్య సంబంధం పాము- కప్పలాంటిదని ఆయన ఎద్దేవా చేశారు.

కాపుల విషయంలో చంద్రబాబు రూథర్ ఫర్డ్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుని ఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. కేవలం ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందుకు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి దాని వెనక మా పార్టీ కుట్ర ఉందని మొదటి రోజు నుంచే సీఎం, హోం మంత్రి అంటున్నారని ఆయన గుర్తుచేశారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం ఉందని.. అందుకే వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. ఫోన్ కాల్ లిస్టులో తన పేరుందని అడిగిన ప్రశ్నకు కేవలం చంద్రబాబు లిస్టులో వున్నందుకే తనను టార్గెట్ చేశారని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles