Taser Gun Tested On Valorous UP Super Cop

Dgp uttar pradesh javeed ahmad shot with taser gun

uttar pradesh, up dgp, javeed ahmad, taser gun, up dgp taser gun, taser gun video, taser gun up dgp, india news, national news

Uttar Pradesh Director General of Police (DGP) Javeed Ahmad Sunday decided to brave the odds by testing a new brand of taser gun on himself.

ITEMVIDEOS: టీజర్ గన్ కు టార్గెట్ గా మారిన పోలీస్ బాస్..

Posted: 09/05/2016 08:51 AM IST
Dgp uttar pradesh javeed ahmad shot with taser gun

ఉగ్రవాదులను హతమార్చకుండా అరెస్టు చేయాలని సాయుధ దళాలు నిర్ణయించుకున్న పక్షంలో.. వాళ్లను నిరోధించడానికి టీజర్ గన్ లను వినియోగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగూణంగా 'టేజర్' గన్‌లను సరఫరా చేసే అమెరికా కంపెనీకి చెందిన భారతీయ యూనిట్ దాన్ని ప్రదర్శించి చూపించాలనుకుంది. అందుకోసం పోలీసుల వద్దకు ఆ గన్ తీసుకొచ్చింది. అక్కడ ఉన్నవాళ్లు కూడా తనలాంటి మనుషులే కాబట్టి దాని షాట్ తగిలితే ఏమవుతుందోనన్న భయం ఉంటుందని భావించిన డీజీపీ జావేద్ అహ్మద్.. తానే స్వయంగా ముందుకొచ్చారు.

ఆ గన్‌తో తనను కాల్చమని చెప్పారు. సాధారణంగా టేజర్ గన్ షాట్ తగిలితే దిమ్మతిరిగి.. వెంటనే కింద పడిపోతారు. అయితే డీజీపీ అలా పడిపోకుండా చూసేందుకు ఆయన పక్కన ఇద్దరు పోలీసులు నిల్చున్నారు. షాట్ తగలగానే ఆయన పడిపోతుంటే పట్టుకుని జాగ్రత్తగా పడుకోబెట్టారు. లేచిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాట.. ''చుక్కలు కనిపించాయి''. అలా అంటూనే ఆయన నవ్వేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిస్తేనే ఇలాంటి ఆయుధాలను కొనుగోలు చేయడానికి వీలుంటుందని, అలా ఒకవేళ కొనుగోలు చేయనిస్తే.. తాము యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌కు వాటిని అందిస్తామని అహ్మద్ చెప్పారు.

డీజీపీ ఇలా టేజర్ షాట్ తీసుకుంటున్న వీడియో, ఫొటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా వ్యాపించాయి. ఐపీఎస్ అధికారుల సంఘం డీజీపీని ఆకాశానికి ఎత్తేసింది. టీజర్లు రెండు ఎలక్ట్రోడ్‌లను అవతలి వాళ్ల శరీరంలోకి ఫైర్ చేస్తాయి. దాంతో ఆ వ్యక్తికి విద్యుత్ షాక్ తగులుతుంది. కొద్ది సెకండ్లపాటు అచేతనంగా మిగిలిపోతారు. దాంతో వాళ్లను అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది. సాధారణంగా ఉగ్రవాదులు ఎక్కడైనా గదుల్లో దాక్కుని ఉన్నప్పుడు, లేదా ఎవరినైనా బందీలుగా తీసుకెళ్లినప్పుడు ఉపయోగించేందుకు తమకు ఇలాంటి ఆయుధాలు బాగా ఉపయోగపడతాయని యూపీ ఏటీఎస్ ఐజీ అసీమ్ అరుణ్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత అప్పుడు వాటి కొనుగోలు ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : up dgp  javed ahmed  taser gun shot  uttar pradesh  

Other Articles