Hilarious and Brilliant! Virender Sehwag's tweet about his wife has the best tip for married men

Virender sehwag prefers non striker s end in partnership with wife

Virender Sehwag, virender sehwag wife Aarti, former indian dashing opener, sachin tendulkar, gautam gambir, twitter, non-striker end, twitter, #ViruKaGyaan, cricket

Former Indian opener Virender Sehwag, who has garnered quite a reputation for being one of the wittiest Indian celebrities on Twitter, again made our day with his supremely entertaining #ViruKaGyaan.

సెకెండ్ ఇన్నింగ్స్ లో చతురతతో రాణిస్తున్న సెహ్వాగ్..

Posted: 09/02/2016 08:54 PM IST
Virender sehwag prefers non striker s end in partnership with wife

తాను ఇండియన్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా తన డేరింగ్, డ్యాషింగ్ ఆటతో యావత్ దేశ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వీరేంద్ర సెహ్వాగ్ తన సెకెండ్ ఇన్నింగ్స్ ను మాత్రం అత్యంత చతురతతో రాణిస్తున్నాడు. అదేంటి అంటారా..? ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ ట్విట్టర్ ద్వారా సాగిస్తున్న విషయం ఆయన ఫాలోవర్స్ కి తెలిసిందే. ఇటీవల రియో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులకు మద్దతుగా, ఈ మెగా ఈవెంట్లో భారత ఆటగాళ్ల ప్రతిభను హేళన చేసిన బ్రిటీష్ జర్నలిస్టుకు కౌంటర్గా ట్వీట్లు చేసి నెటిజన్ల ప్రశంసలందుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర  సెహ్వాగ్ ఈసారి భార్య గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

ఈ డాషింగ్ ఓపెనర్ 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్తో కలసి జట్టుకు ఎన్నోసార్లు విలువైన శుభారంభం అందించి విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టీమిండియా ఓపెనర్గా ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ల నుంచి ఇన్నింగ్స్ తొలిబంతిని ఎదుర్కొనేందుకు వెనుకాడని వీరూ.. భార్యతో ఉన్నప్పుడు మాత్రం సురక్షితమైన నాన్ స్ట్రయికర్ స్థానాన్ని ఎంచుకోవాలని సరదాగా  ట్వీట్ చేశాడు. భార్యతో అయితే నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉండాలి.. అంటూ వీరూ జోక్ చేశాడు. వీరూ తన భార్య ఆర్తితో కలసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  Aarti  non-striker end  twitter  cricket  

Other Articles