మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేయకుండా పోయిన వైద్యుడు | Doctor abandons anaesthetised patients citing faulty equipment

Doctor abandons anaesthetised patients citing faulty equipment

Uttar Pradesh Doctor abandons anaesthetised patients, Doctor anaesthetised patients, anaesthetised patients, anaesthetised patients family planning operations in UP, Johmpur doctor anaesthetised patients, anaesthetised patients left by doctor, anaesthetised woman patients, Doctor praveen abandons anaesthetised patients

In Uttar Pradesh Doctor abandons anaesthetised patients citing faulty equipment.

మహిళలకు మత్తుమందిచ్చిన డాక్టర్, ఆపై ఏం చేశాడు

Posted: 09/01/2016 11:55 AM IST
Doctor abandons anaesthetised patients citing faulty equipment

జనాల ప్రాణాలు కాపాడే వైద్యుడ్ని దేవుడిగా అభివర్ణిస్తుంటారు. కానీ, ఇక్కడో వైద్యుడు చేసిన నిర్లక్ష్యంతో కాస్తలో 17 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఉత్తరప్రదేశ్‌ మహరాజ్గంజ్ ప్రాంతంలోని జాన్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇది జరిగింది. ఓ ప్రభుత్వ వైద్యుడు 17 మంది మ‌హిళ‌లకు ఆప‌రేష‌న్ చేయ‌డం కోసం మ‌త్తుమందు ఇచ్చి త‌న పని పూర్తి చేయ‌కుండానే వెళ్లిపోయాడు. దీంతో ఆ మ‌హిళ‌ల బంధువులు తీవ్ర ఆందోళ‌న చెందాల్సి వ‌చ్చింది.

ఆసుప‌త్రిలో 30 మంది మహిళ‌ల‌కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ శ‌స్త్ర‌చికిత్స డాక్ట‌ర్‌ ప్రవీణ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గాల్సి ఉంది. ఆప‌రేష‌న్ చేసే ఉద్దేశంతో మొద‌ట ప్రవీణ్ కుమార్ ఆ మహిళలకు మ‌త్తు మందు ఇవ్వాల‌ని అక్క‌డి సిబ్బందికి చెప్పాడు. మ‌త్తుమంతు ఇచ్చిన త‌రువాత శ‌స్త్ర‌చికిత్స చేసేందుకు అవసరమైన సామగ్రి లేదంటూ స‌ద‌రు డాక్ట‌ర్ ఆసుప‌త్రి నుంచి ఎక్క‌డికో వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆగ్ర‌హించిన స‌ద‌రు మహిళల బంధువులు ఆందోళన చేప‌ట్టారు.మ‌హిళ‌లను ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లేలా డాక్ట‌ర్ ప్ర‌వ‌ర్తించాడ‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారు ఆందోళనకు దిగడంతో అక్కడి సిబ్బంది స్పందించి తమపై అధికారులకు సమాచారాన్ని చేరవేశారు.

విషయం బయటికి పొక్కడంతో పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఏ కూడా అక్క‌డికి రావాల్సి వ‌చ్చింది. మ‌హిళ‌ల‌కు మ‌త్తుమందిచ్చి వెళ్లిపోయిన నాలుగు గంట‌ల త‌రువాత ప్ర‌వీణ్ కుమార్ అక్క‌డ‌కు మ‌ళ్లీ వ‌చ్చాడు. అయితే అప్ప‌టికే మ‌త్తుమందు తీసుకున్న 17 మంది మ‌హిళ‌లు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అక్క‌డకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వ‌చ్చిన మరో 13 మంది మ‌హిళ‌ల‌కు ప్ర‌వీణ్ కుమార్ రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు శ‌స్త్ర‌చికిత్స జ‌రిపాడు. డాక్ట‌ర్ నిర్వాకంపై స్పందించిన‌ డీఎం ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి నివేదిక అందించాల‌ని చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  anaesthetised patients  woman  Doctor  abandon  

Other Articles