బాల్య వివాహాల్లో మైనర్ సెక్స్ రేప్ కాదు | Sexual intercourse by man with wife in minor marriage not rape.

Sexual intercourse by man with wife not rape

Sexual intercourse in Minor marriages, not rape in Child marriages, minor marriages in India, child marriage in India, central to State on Child Marriages, Supreme Court to Central on Child marriages

Sexual intercourse by man with wife not rape in Child marriages.

ఆ పెళ్లిలలో శృంగారం రేప్ కానే కాదు

Posted: 08/30/2016 09:02 AM IST
Sexual intercourse by man with wife not rape

బాల్య వివాహాల్లో భార్య, భర్తలు శృంగారంలో పాల్గొంటే అది రేప్ కింద రాదని అంటోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని, తద్వారా మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ ఓ ఎన్జీవో సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు ప్రభుత్వ వివరణ కోరగా, సోమవారం దానికి సంబంధించి వాదనలు వినిపించింది.

మైనర్ వ్యక్తి, మైనర్ అయిన తన భార్యతో శృంగారంలో పాల్గొనడం రేప్ కిందకు రాదని స్పష్టం చేసింది. బాల్యవివాహాలు, సంప్రదాయాల గురించి వివరిస్తూ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ లో కేంద్రం ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల కంటే తక్కువైన వ్యక్తి అంతకంటే తక్కువ వయసున్న తన భార్యతో జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదు, 18 ఏళ్లలోపు వారు ఆ పని చేయటం నేరమే అయినా అది వారి వైవాహిక సంబంధానికి సంబంధించింది దానిని రేప్ కింద పరిగణించలేం అని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

అలాగని తాము బాల్య వివాహాలను సమర్థించడం లేదని స్పష్టం చేసింది. అయితే దేశంలోని కొన్ని సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్ల కారణంగా జరిగే బాల్య వివాహాలకు భార్యాభర్తల విలువలే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ దారులకు మరో వారం గడువు ఇచ్చి వాదనలు వినిపించాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Child Marriages  India  Supreme Court  Central  

Other Articles