సింధుతో సహా రియో విజేతలకు ఖేల్ రత్న బహుకరణ | President Pranab Mukherjee confers Khel Ratna to Rio winners

President pranab mukherjee confers khel ratna to rio winners

President Pranab Mukherjee confers Khel Ratna, Khel Ratna PV Sindhu, PV Sindhu Khel Ratna, Khel Ratna PV Sindhu, PV Sindhu Pranab Mukharjee, Pranab Mukharjee with Rio winners

President Pranab Mukherjee confers Khel Ratna to Rio winners.

క్రీడా అవార్డుల ప్రదానోత్సవం... ఖేల్ రత్న అందుకున్న సింధు

Posted: 08/29/2016 03:05 PM IST
President pranab mukherjee confers khel ratna to rio winners

జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. కొద్దిరోజుల క్రితం కేంద్రం రియో ఒలంపిక్స్ లో ప్రతిభ కనబరిచిన నలుగురికి ఖేల్ రత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు 15 మందికి అర్జున అవార్డు, ఆరుగురు కోచ్లకు ద్రోణాచార్య అవార్డులను అనౌన్స్ చేసింది. సోమవారం వారికి ఆయా అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను అందజేశారు.

రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఖేల్ రత్నగా మారిపోయింది. తొలి మహిళా రెజ్లర్‌గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా ఆరు అంతర్జాతీయ పతకాలను జితూ రాయ్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ నలుగుర్ని రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వరించింది. వీరికి పురస్కారంతో పాటు రూ. 7.5 లక్షల చెక్ ను అందజేశారు.

ఇక ఈ విజయంతో ఒక్కసారిగా స్టార్ షట్లర్ గా మారిపోయింది సింధు. ఇప్పటికే రూ.12 కోట్లకు పైగా నగదు నజరానాతో పాటు సర్కారీ ఉద్యోగం, నవ్యాంధ్ర నూతన రాజధానిలో ఇంటి స్థలం, తిరిగేందుకు లక్షల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కారు ఆమె దరి చేరగా, తాజాగా అత్యుత్తమ క్రీడాకారులకు అందే పురస్కారం ఆమె సొంతం అయ్యింది.

PV sindhu president Pranab Mukharjee

మరోవైపు అర్జున అవార్డు దక్కించుకున్న వారిలో క్రీడాకారులు రజత్ చౌహాన్ (ఆర్చ‌రీ), ల‌లితా బాబ‌ర్ (అథ్లెటిక్స్‌), సౌర‌వ్ కొఠారి (బిలియ‌ర్డ్స్‌), శివ‌థాపా (బాక్సింగ్‌), అజింక్యా ర‌హానే (క్రికెట్‌), సుబ్ర‌తా పాల్‌ (ఫుట్‌బాల్‌), రాణి (హాకీ), వీఆర్ ర‌ఘునాథ్‌ (హాకీ), గురుప్రీత్‌సింగ్ (షూటింగ్‌), అపూర్వి చందేలా (షూటింగ్‌), సౌమ్య‌జిత్ ఘోష్‌ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్‌), అమిత్‌కుమార్‌ (రెజ్లింగ్‌), సందీప్‌సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్‌), వీరేంద్ర సింగ్‌ (రెజ్లింగ్‌-బ‌ధిర‌)ఉన్నారు.

కోచ్ ల విషయానికొస్తే... నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్)లకు ద్రోణాచార్య పురస్కారం దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukharjee  PV Sindhu  Khel Ratna  

Other Articles