Nude monk addresses Haryana assembly, leaves Twitterati furious over misogynist anaology

Purifying politics jain monk addresses haryana assembly

tarun sagar, nude tarun sagar, jain tarun sagar, female foeticide, monsoon session, tarun sagar , eradicate female foeticide, haryana female foeticide, jain religious leader, haryana assembly, haryana monsoon session, education minister ram bilas sharma, education minister, haryana chief minister, manohar lal khattar, haryana governmnet

Religious leader and Jain monk Tarun Sagar was invited to address the Haryana Assembly. In his speech, he used a husband-wife analogy to explain how dharma and politics are related. Twitterati, furious over the analogy, slammed him tagging him a misogynist.

అసెంబ్లీలో దిగంబర సన్యాసి.. నెట్ జనుల మండిపాటు..

Posted: 08/27/2016 07:54 PM IST
Purifying politics jain monk addresses haryana assembly

రాజకీయాలను కాలుషతం కాకుండా ఆద్యాత్మిక ప్రబోదాలు బోధించడం మంచిదే, అయితే ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక దిగంబర సన్యాసిని అహ్వానించి.. ఆయనకు గవర్నర్ సహా ముఖ్యమంత్రి కన్నా ఎత్తైన ఫీఠం వేసి అక్కడి నుంచి సభను ఉద్దేశించి ప్రసంగించడంపై నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎలాంటి అచ్చేదన లేకుండా ఇలా సన్యాసులు అసెంబ్లీలోకి వచ్చినా కూడా వారిపై ఎలాంటి కేసులు తీసుకోరా..? అంటూ కొందరు, ఇది విచిత్రం కాదని మరికొందరు.. అసెంబ్లీలోకి దిగంబర బాబాను ఎందుకు రాణించారంటూ మరికోందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ధర్మం భర్త అయితే, రాజకీయాలు భార్యలాంటిది. భార్యపై భర్త నియంత్రణ ఏవిధంగా ఉంటుందో రాజకీయాలపై ధర్మం నియంత్రణ అదేవిధంగా ఉండాలంటూ ఆయన ప్రబోధించారు. స్త్రీ భ్రూణ హత్యలను నిర్మూలించాలని సూచించారు. పొరుగుదేశం పాకిస్థాన్‌పైనా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. 40 నిమిషాలపాటు సాగిన ఆయన ప్రసంగాన్ని పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు, సీఎం, గవర్నర్‌ శ్రద్ధగా విన్నారు. ఆయనే జైన దిగంబర బాబా తరుణ్‌ సాగర్‌.

హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. నగ్నంగా సమావేశాలకు హాజరైన తరుణ్‌ సాగర్‌ బాబా గవర్నర్‌, సీఎం, ఎమ్మెల్యేల కన్నా ఎత్తైన డయాస్‌పై కూర్చొని ప్రసంగించారు. ఒక బాబా నగ్న అవతారంలో అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. హర్యానా విద్యాశాఖ మంత్రి రాంవిలాస్ శర్మ సూచన మేరకు తరుణ్‌ సాగర్‌ 'కద్వే వచన్‌' పేరిట ప్రసంగించారు. 'రాజనీతిపై ధర్మం అంకుశం ఉండాల్సిందే. ధర్మం భర్త అయితే, రాజకీయాలు భార్య. తన భార్య సంరక్షించడమే ప్రతి భర్త కర్తవ్యం అవుతుంది. అదేవిధంగా భర్త అనుశాసనాన్ని స్వీకరించడమే ప్రతి భార్య ధర్మం అవుతుంది' అని ఆయన ప్రబోధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jain religious leader  Haryana Assembly  Tarun Sagar  nude monk  manohar lal khattar  

Other Articles