Kannada actress Ramya attacked with eggs in Mangaluru over 'pro-Pak remarks'

Eggs pelted at congress leader ramya s car in mangalore

Kannada actress Ramya, Kannada actress, attacked with eggs, Mangaluru airport, pro-Pak remarks

Kannada actor-turned-politician Ramya, who has been in the eye of a storm after a sedition case was slapped against her over her alleged pro-Pakistan comments.

నటికి చేదు అనుభవం.. మంగళూర్ లో కోడిగుడ్ల దాడి..

Posted: 08/26/2016 07:12 AM IST
Eggs pelted at congress leader ramya s car in mangalore

ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత రమ్యకు చేదు అనుభవం ఎదురైంది. అమైపై పలువురు నిరసనకారులు, ఏబీవీపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు దుండగులు కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని రమ్య పేర్కొన్నారు. ఇందుకు ఇటీవల అమె చేసిన దాయధి పాకిస్థాన్ ను ప్రశంసిస్తూ అమె చేసిన వ్యాఖ్యలే కారణం అయ్యాయి.

పాకిస్తాన్ నరకమని కేంద్రమంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను విభేదించి అమె.. పాకిస్థాన్ లోనూ ప్రజలు భారతీయుల్లాగానే బతుకుతున్నారని అమ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రమ్యపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయినా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేందుక అమె నిరాకరించారు, తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమని అమె అన్నారు. ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదు అయింది. శత్రుదేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై సెక్షన్ 124/ఎ, 334ల కింద  కొడగు జిల్లా సోమవార పేటలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో ప్రైవేటుగా దేశద్రోహం కేసు దాఖలైంది.

ఇదిలావుండగా, రమ్యపై కేసు నమోదు చేయాలని కోరుతూ కే విట్టలగౌడ అనే న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదును సోమవారం పరిశీలనకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. బహుభాషా నటి అయిన రమ్య భారత్‌ను అవమానించారని, బద్ధశత్రువైన పాక్‌ను ప్రశంసించడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టారని గౌడ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇటీవల సార్క్ యువ శాసనకర్తల ప్రతినిధివర్గంలో భాగంగా పాకిస్థాన్ వెళ్లివచ్చిన రమ్య కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన ఒక సభలో తన యాత్రానుభవాలను వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada actress  congress former MP Ramya  Mangaluru  'pro-Pak remarks'  

Other Articles