complete ban on-commercial surrogacy says sushma swaraj

India govt moves to ban commercial surrogacy

Surrogacy, Surrogacy bill, Surrogate Mothers, Sushma Swaraj, health ministry, JP Nadda, Cabinet Clears Surrogacy Bill, India News

Bill cleared by cabinet evokes fears that it could create an underground surrogacy network in India on the lines of the organ harvesting racket

అద్దె గర్భంపై కేంద్రం అంక్షలు.. స్టార్లకు చురకలు..

Posted: 08/24/2016 07:43 PM IST
India govt moves to ban commercial surrogacy

మాతృత్వం పోందడమన్నది ఓ వరం. కానీ పరాయి పిల్లలకు మాతృత్వాన్ని అద్దెకివ్వడం.. అద్దె గర్భం దాల్చడం ఇకపై నేరమే. పిల్లలు లేని దంపతులకు వైద్యశాస్త్రం అందించిన వరం అద్దె గర్భం (సరోగసీ) విధానం. అయితే, ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సరోగసి చట్టాన్ని తీసుకువస్తున్నది. బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన ఈ బిల్లు  చట్టరూపం దాలిస్తే.. సరోగసీ కోసం పిల్లలు లేని దంపతులు ఇతర మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కుదరదు. ఇందుకోసం వారు తమ బంధువులు, లేదా తెలిసిన వారి సహాయం మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది.

'వాణిజ్య సరోగసీపై పూర్తి నిషేధం ఉంటుంది. వైద్యపరంగా పిల్లలు పొందలేని దంపతులు తమ సన్నిహిత బంధువుల సాయం తీసుకొని సరోగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. దీనిని అల్ట్రుయిస్టిక్‌ సరోగసీ అంటారు' అని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఈ బిల్లు ప్రకారం విదేశీయులు, ప్రవాస భారతీయులు, సింగల్ పెరెంట్‌, సహజీవనం చేసే దంపతులు, స్వలింగ సంపర్కులు సరోగసీ విధానం ద్వారా పిల్లలు పొందడానికి ఇకమీదట అనుమతించబోరు. 'ఓ జంట పెళ్లిచేసుకొని, కనీసం ఐదేళ్లు కలిసి జీవిస్తేనే' సరోగసీ విధానం అనుమతిస్తామని, వారికి ఇప్పటికే ఓ సంతానం ఉంటే ఇందుకు అనుమతించబోమని సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు.

తాజాగా తీసుకొచ్చిన సరోగసి బిల్లులో సెలబ్రిటీలకు ఎలాంటి మినహాయింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ సందర్భంగా సుష్మస్వరాజ్ బాలీవుడ్ స్టార్‌ హీరోలు షారుఖ్‌ ఖాన్‌, ఆమిర్ ఖాన్‌లకు పరోక్షంగా చురకలు అంటించారు. 'ఇద్దరేసి పిల్లలు ఉన్నప్పటికీ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా మరో బిడ్డను కన్నారు. వాళ్ల భార్యలు పిల్లల్ని గర్భంలో మోసే బాధను పొందలేరు కనుక వేరే మహిళల మీద ఆ భారాన్ని మోపారు' అని సుష్మా పేర్కొన్నారు. అదేవిధంగా అద్దెగర్భాన్ని మోసినందుకు సన్నిహిత బంధువు అయిన మహిళకు వైద్యఖర్చులు మాత్రమే చెల్లించాలని, అంతేకానీ ఎక్కువమొత్తంలో ఆశ చూపకూడదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surrogacy  Surrogacy bill  Sushma Swaraj  foreigners  celebrities  India  

Other Articles