Union ministers Rathore, Goyal violate traffic rules along with party cadre

Union ministers rathore goyal ride two wheeler without helmets

Tiranga Bike Rally, Rajyavardhan Singh Rathore, Independence Day celebrations, Rathore and Goel ride bike without helmets, Piyush Goyal, bjp cadre seen without helmets, no helmets in tiranga rally, rules for public, ministers violate traffic rules

Union ministers Piyush Goyal and Rajyavardhan Singh Rathore on Tuesday kicked up a row by riding a motorcycle sans helmets during a ‘Tiranga Yatra’ in Jaipur.

కేంద్రమంత్రులంటే వెంట.. హెల్మట్ లు ఎందుకంటా..!

Posted: 08/24/2016 11:29 AM IST
Union ministers rathore goyal ride two wheeler without helmets

రాష్ట్రమంత్రులు వెంటవుంటేనే అకాశమే తమ హద్దుగా భావించే కార్యకర్తలు.. తమ వెనక కాదు కాదు.. తమ ముందు వున్నది కేంద్రంలో వున్న పార్టీకి చెందిన మంత్రులంటే ఇక వారిని అపడం ఎవరి తరం. అందుకనే అనుకుంటా.. వారంతా మూకుమ్మడిగా ట్రాఫిక్ నిబంధనలకు తూట్లు పోడిచారు. అయితే వారితో పాటు తమకు అండగా, కొండంత బలంగా వున్న ఇద్దరు కేంద్రమంత్రులు కూడా వారితో పాటుగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. కేంద్ర మంత్రుల వెంట పెద్ద సంఖ్యలో వున్న కార్యకర్తలందరూ ఈ తప్పును చేశారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో కేంద్రమంత్రలు ఇలా నిబంధనలు తోసిరాజారు. పింక్ సిటీగా పేరొందిన జైపూర్ నగరంలో ప్రధాని నరేంద్రమోడీ పిలుపు వేరకు తిరంగా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లు మోటారుసైకిలు నడిపారు. జైపూర్ లోని బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన తిరంగా ర్యాలీలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బైక్ నడపగా, మరో కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ వెనుక కూర్చున్నారు.

ఇద్దరు కేంద్రమంత్రులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని విలేఖరులు ప్రశ్నించగా, మంత్రులు సంప్రదాయం ప్రకారం తలపాగాలు చుట్టారని స్థానిక బీజేపీ నేతలు సమర్ధించటం కొసమెరుపు. గతంలో కేంద్ర రవాణాశాఖామంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపి వివాదంలో చిక్కుకున్న విషయం పాఠకులకు విదితమే. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపితే ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కింద రూ.200ల జరిమానా విధించవచ్చు. కాని ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇక్కడ ప్రేక్షకపాత్ర వహించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tiranga rally  piyush goel  Rajyavardhan Singh Rathore  helmet  bike rally  traffic rules  

Other Articles