Bomb blasts kill one, wound 30 in southern Thailand: police

Bomb blasts kill one wound 30 in southern thailand

thailand, thailand bomb blast, bomb blast thailand, thailand southern insurgent group, southern is groups, southern Thai bomb blasts, bomb blasts coastal town Pattani, thailand attack, latest news, world news

No group has claimed responsibility for the wave of bombings, but some security experts noted at the time that southern insurgent groups have a track record of carrying out coordinated bombing attacks.

వరుస బాంబు పేలుళ్లతో భీతావహ పరిస్థితి.. ఒకరు మృతి..

Posted: 08/24/2016 07:35 AM IST
Bomb blasts kill one wound 30 in southern thailand

థాయ్లాండ్లో వరుస బాంబు పేలుళ్లతో బీతావహా పరిస్థితి అలుముకుంది, దక్షిణ థాయ్ పట్టణ ప్రావిన్స్లోని కోస్తా పట్టణం పఠానీలో మంగళవారం అర్థరాత్రి వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది.  మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ధాయ్ లాండ్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి పబ్కు అతి సమీపంలో పేలుడు సంభవించింది.

ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అరగంట వ్యవధిలో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా....... 30 మంది గాయపడ్డారని పోలీసులు అధికారులు తెలిపారు. స్థానిక మార్కెట్ సమీపంలో మరో బాంబు పేలుడు సంభవించింది. రెండు వారాల క్రితమే వరుస పేలుళ్లు దేశాన్ని కుదిపేసిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకోవడంతో ధాయ్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో అస్ట్రేలియాతో పాటు పలు దేశాలు తమ దేశ పౌరులకు అంక్షలు విధించాయి. ధాయ్ లాండ్ పర్యటనకు తమ దేశ పౌరులు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.

కేవలం పక్షం రోజుల వ్యవధిలో ఇలా బాంబు దాడుల చోటుచేసుకోవడంతో పలు దేశాలు అందోళన వ్యక్తం చేస్తూ.. అంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే అ దేశంలో వున్న తమ దేశ పౌరులను స్వదేశాలకు రావాల్సిందిగా కూడా కోరుతున్నారు. పక్షం రోజుల క్రితం ఉత్తర ధాయ్ లాండ్ లో సంభవించిన  వరుస బాంబు పేలుళ్లలో నలుగురు మరణించగా, 11 మంది విదేశీ పర్యాటకులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బాంబు దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thailand  bomb blasts  One killed  30 injured  southern Thai  coastal town  Pattani  

Other Articles