natti kumar comments nayeem links with Tollywood | natti kumar comments nayeem links with Tollywood

Natti kumar comments nayeem links with tollywood

Natti Kumar Sensational Comments on Gangster Nayeem, Nayeem Tollywood links, Gangster Nayeem Links with Film Industry, producers behind Nayeem, Nayeem producers, Natti Kumar Nayeem

Producer Natti Kumar Sensational Comments on Gangster Nayeem Links with Film Industry.

ITEMVIDEOS:నయీం టాలీవుడ్ లింకులపై నట్టికుమార్

Posted: 08/22/2016 03:26 PM IST
Natti kumar comments nayeem links with tollywood

ఇటీవల తెలంగాణ గ్రేహౌండ్స్ చేతిలో హతమైన నయీంకు టాలీవుడ్ తో ఉన్న లింకులపై నిర్మాత నట్టికుమార్ బాంబు పేల్చాడు. పలువురు అగ్ర నిర్మాతలకు నయీంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని పేర్లు బయటికి చెప్పేశాడు.

ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్న సి. కల్యాణ్, అశోక్ కుమార్, బండ్ల గణేశ్, సచిన్ జోషిలకు నయీం తో సంబంధాలున్నాయని నట్టికుమార్ ఆరోపించాడు. ఓ సినిమా విషయంలో బండ్ల గణేష్ సచిన్ ను మోసం చేయగా, ఆ సెటిల్ మెంట్ చేసింది నయీమేనంటూ తెలిపాడు. ఇక విజయవాడ నుండి ఉత్తరాంధ్ర వరకు పలు థియేటర్ లలో నయీం అనుచరులే క్యాంటీన్లను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవటం దారుణమని అన్నారు.

నర్సంపేటలో కోటి రూపాయల విలువ చేసే తన ధియేటర్ కు రూ.25 లక్షలిచ్చి లాక్కుడని తెలిపారు. నయీంకు కొంతమంది సినిమా పరిశ్రమ పెద్దలు కూడా సహకరించారని ఆరోపించారు. టాలీవుడ్ కు ఉన్న లింకులపై తెలంగాణ సిట్ కు త్వరలోనేఫిర్యాదు చేస్తానన్నారు. ఏపీలోని కొందరు పోలీసు అధికారులకు కూడా నయీమ్ తో సంబంధాలున్నాయన్నారు. ఈ విషయాలపై ఏపీ పోలీసులు, మంత్రి అచ్చెన్నాయుడికి చెప్పినా పట్టించుకోలేదని కూడా నట్టికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కొందరు నయీం అనుచరులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి గెస్ట్ హౌస్ లో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నట్టి చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Natti Kumar  Gangster Nayeem  Tollywood  links  

Other Articles