28-Year-Old JNU Scholar Allegedly Drugged, Raped By Fellow Student

Jnu student allegedly raped by aisa activist

DU student, blind date, rape, sexual assult, garment outlet, Facebook, sedatives, Dwarka (north) police station, Dwarka, southwest Delhi.Jharkhand girls, rape on woman, sexual assult on woman

A blind date proved costly for a 20-year-old DU student after the man offered her spiked drinks and assaulted her sexually. The case was reported from Dwarka, southwest Delhi.

ఢిల్లీలో దారుణం. మత్తు పధార్థాలిచ్చి.. విద్యార్థినిపై రేప్

Posted: 08/22/2016 08:35 AM IST
Jnu student allegedly raped by aisa activist

దేశ రాజధానిలో అత్యాచారాలకు రాజధానిగా మారింది. వారం రోజుల క్రితం జార్ఖంగ్ కు చెందిన ఇద్దరు యువతులను మత్తుపదార్థాలిచ్చి ముగ్గురు సామూహిక అత్యాచారాలకు తెగబడిన ఘటనను మరువక ముందే మరో దారుణం జరిగింది. ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓ పీహెచ్‌డీ విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి, హాస్టల్ గదిలోనే అత్యాచారం చేశారు. అమ్మాయిపై కన్నేసిన కామాంధుడు అమెను మాయమాటలతో వంచించి తన గదికి తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఫేస్ బుక్ లో పరిచయం అయిన అన్మోల్ రతన్ అనే ఆ విద్యార్థి.. తాను చూడాలనుకుంటున్న సినిమా ఉందని మెసేజ్ ఇచ్చాడని, తనతో పాటు బ్రహ్మపుత్ర హాస్టల్‌కు రావాల్సిందిగా కోరాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతకుముందు ఆమె ఎవరిదగ్గరైనా ఆ సినిమా ఉందా అని ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టడంతో అతడు తన దగ్గర ఉందని చెప్పాడు. పెన్‌డ్రైవ్‌లోకి సినిమా కాపీ చేసుకోడానికి తాను అన్మోల్ రతన్ గదికి వెళ్లినప్పుడు అతడు తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదుచేసింది.

కాసేపటికే తాను స్పృహ కోల్పోయానని, తాను స్పృహలో లేనప్పుడే అతడు తనమీద అత్యాచారం చేశాడని తెలిపింది. తనకు మెలకు వచ్చిన తర్వాత గట్టిగా అరిచేందుకు ప్రయత్నించానని, కానీ రతన్ తన నోరు నొక్కేశాడని చెప్పింది. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే బాగోదంటూ ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన అతడు బెదిరించాడు. ఎట్టకేలకు ఆమె వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్లు 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపారు. ఎఫ్ఐఆర్ దాఖలు కాగానే ఏఐఎస్‌ఏ రతన్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది. అయితే ఈ వ్యవహారంపై తనకు ఫిర్యాదు ఏమీ రాలేదని జేఎన్‌యూ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యూనివర్సిటీ సెక్యూరిటీ విభాగాన్ని కూడా తాను అడగ్గా వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DU student  blind date  rape  sexual assult  Dwarka  southwest Delhi  

Other Articles