Crude Oil Found In A Gaya Well, Locals Throng To Claim Their Share

Oil found in a well locals throng to claim their share

gaya, oil discovery, oil well, Chandrashekhar Singh, gaya sub inspector. gaya police station, Gaya, Bihar, news world india, shocking news, discovery news

An oil discovery has been made in Bihar’s Gaya. According to reports, oil has been found in a well at the district.

భళారే... చమురు కోసం పోటీపడ్డ గ్రామస్థులు.. !

Posted: 08/21/2016 08:03 AM IST
Oil found in a well locals throng to claim their share

పెట్రోల్ బావులు గురించి వినడమే కానీ కళ్లారా చూడటం మాత్రం భారత్ దేశంలో పుట్టిన వారి వల్ల మాత్రం కాదు. ఏదో సౌదీలో మాత్రం ఉన్నాయంటూ పాత చిత్రాలలో హీరోలు చెప్పగా విన్నడమే కానీ.. అక్కడ కూడా బావుల్లోంచి పెట్రోల్ తోడుకోవడం, దానిని చూడటం మాత్రం అరుదనే చెప్పాలి. అయితే బీహార్ లోని గయాలో మాత్రం అది నిజమైంది. ఓ పురాతన బావి నీళ్లు ఉంటాయని భావించి బొక్కెన వేసి తోడారు స్థానికులు. కానీ ఆ బావిలో నీళ్లకు బదులు పెట్రోల్‌ లాంటి చమురు లభించింది. అంతే ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోయింది.

స్థానికులు పెద్ద సంఖ్యలో బకెట్లు, బిందెలు వేసుకొని బావి చుట్టూ ఫ్రీగా లభించే చమురు కోసం మూగారు. తమ వాటా చమురు కోసం పోటీపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని గయా నగరంలో చోటుచేసుకుంది. ఓ బావిలో పెట్రోల్ లాంటి చమురు లభిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. దీంతో పెద్దసంఖ్యలో జనం ఆ చమురును సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు. ఈ సమాచారం తెలియడంతో బిహార్ ప్రభుత్వం కూడా స్పందించింది. బావిలో పెట్రోల్ తరహా చమురు లభిస్తున్నట్టు తెలిసిందని, దీంతో బావిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్‌ఐ చంద్రశేఖర్ సింగ్‌ తెలిపారు. ఈ బావిని పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల బృందం రానుందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles