Government To Bear Transaction Cost Of Payments Received Via Cards

Government to bear transaction cost of payments received via cards

credit cards, debit cards, Net banking, payments, merchant discount rate, Neeraj Gupta, MDR, Government, indian economy, DIPAM

In order to promote less cash economy, the government has said it will bear the transaction cost for all payments made to it through debit or credit cards and net banking

డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు ఊరట.. అదనపు చార్జీలకు ఫుల్ స్టాప్..

Posted: 08/16/2016 08:23 PM IST
Government to bear transaction cost of payments received via cards

క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ మనీ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది. కార్టులపై లావాదేవీలు సాగించే వినియోగదారులను ఇబ్బందిపెడుతున్న  అదనపు చార్జ్ లను ఇక పైన ప్రభుత్వమే భరించనుంది. నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసిన అన్ని చెల్లింపుల లావాదేవీల ఖర్చులను ఇకముందు  తామే భరించనున్నామని  ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వినియోగదారులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)  పేరిట  చెల్లిస్తున్న  చార్జీలను  ఇక ముందు చెల్లించాల్సి అవసరం లేదని ఆర్థికమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.  

డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు లేదా డిజిటల్ మార్గాల ద్వారా ప్రజలు ఇక ఎలాంటి  వర్తక డిస్కౌంట్ రేటును భరించాల్సిన అవసరం లేదని అని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం జారీ చేసిన తాఖీదులో  పేర్కొన్నారు.  దీనికి సంబంధించి  వివరణాత్మక మార్గదర్శకాలు మరియు కార్యాచరణ విధివిధానాలను  జారీ చేయనున్నామని చెప్పారు. కాగా గతంలో ప్రభుత్వం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్ మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి నీరజ్ గుప్తా ఆధ్వర్యంలో ఒక  టాస్క్ ఫోర్స్ ను  ఏర్పాటు చేసింది. ఈ మేరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు మరియు నెట్ బ్యాంకింగ్ సేవలను  ప్రోత్సహించే యోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : credit cards  debit cards  Net banking  payments  merchant discount rate  

Other Articles