Chief Justice TS Thakur questions PM Narendra Modi’s silence on appointment of judges

Spare thought for judiciary cji tells government

narendra modi, t s thakur, cji t s thakur, cji modi, cji judges appointment, Congress, Chief Justice of India, Narendra Modi I-Day speech, Modis speech

"It is all becoming very difficult for us and this is why I have repeatedly urged them (government) to pay attention to these problems,” said T S Thakur.

మోడీ రికార్డు ప్రసంగంపై భారత ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి

Posted: 08/16/2016 12:34 PM IST
Spare thought for judiciary cji tells government

ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత చరిత్రలోనే సుమారు 94 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన మోదీ ఆయన తన రికార్డును తానే తిరగరాసుకుని చరిత్ర సృష్టించారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగానికి ఎవరు సమ్మోహితులు అయ్యారో, ఎవరు విమర్శలు గుప్పించారో తెలియదు కానీ.. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలో దేశంలోని పలు అంశాలు స్పృషించిన మోదీ.. న్యాయస్థానాలపై మాత్రం మాట్లాడలేదు. సుప్రీంకోర్టు, ఇతర కోర్టుల న్యాయమూర్తుల పెండింగ్ నియామకాలకు సంబంధించిన ప్రస్తావనే తీసుకురాలేదని, ఇది తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. దీంతో ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో న్యాయం జరిగేందుకు ఎంత సమయం పట్టిందో ప్రస్తుతం కూడా అంతే సమయం పడుతోందని, కేసులను పూర్తి చేసేందుకు కోర్టులకు పదేళ్లు పడుతుందని, ఇది న్యాయ వ్యవస్థ పనికి ఆటంకంగా మారిందని అన్నారు.

‘ప్రజాకర్షణగల ప్రధాని గంటన్నరపాటు చేసిన ప్రసంగాన్ని విన్నాను. జడ్జీల నియామకాన్నీ ప్రస్తావిస్తారని ఆశించా. ప్రధానికి ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. మీరు పేదరికాన్ని నిర్మూలించండి. ఉపాధి కల్పించండి...పథకాలు ప్రవేశపెట్టండి. అదే సమయంలో దేశ ప్రజల న్యాయం గురించీ ఆలోచించండి’ అని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో సీజేఐ అన్నారు. వృత్తిరీత్యా తాను అత్యున్నతస్థాయికి చే రుకున్నందు వల్ల...ఇక జీవితంలో ఆశించేది ఏమీ లేనందువల్ల నిర్మొహమాటంగా నిజం మాట్లాడుతున్నానన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles