Independence Day PM Narendra Modi addresses price rise to progress

Past govts had doubts we have aspirations says pm

independence day, independence day live, narendra modi, narendra modi speech and flag hoisting independence day 2016, modi, pm modi, modi speech, red fort, i day, modi independence day

Prime Minister Narendra Modi said it is "our duty to make India the very best", adding that his focus is on taking India "swarajya to surajya".

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకుందాం: ప్రధాని మోడీ

Posted: 08/15/2016 11:02 AM IST
Past govts had doubts we have aspirations says pm

దేశాన్ని గత 70 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు ఇంకా స్వరాజ్యం నినాదంతోనే ముందుకు తీసుకెళ్లడం భాధాకరమని.. ఇకనైనా స్వరాజ్యాన్ని సురాజ్యం దిశగా పయనింపజేసేందుకు ప్రతీ ఒక్క భారతీయుడు కంకణ బద్దుడు కావాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తొలుత రాజ్‌ఘాట్‌ వద్ద బాపూజీకి మోడీ నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని ముందుగా 125 కోట్ల మంది భారతీయులకు నా శుభాకాంక్షలు' అని తెలిపారు.

సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అని కొనియాడారు. స్వాతంత్ర్యం వెనక లక్షలాది మహానుభావుల త్యాగఫలం ఉందని గుర్తు చేశారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని సంకల్పిద్దామని సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. కృష్ణుడి నుంచి గాంధీవరకు, భీముడి నుంచి భీంరామ్‌ అంబేద్కర్‌ వరకు భారతదేశానికి సనాతన చరిత్ర ఉందని ప్రధాని మోదీ ప్రసంశించారు. ముక్కలైన దేశాన్ని సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఏకం చేశారని మోదీ గుర్తు చేశారు. జాతి, కులం పేరుతో ఎవరినీ అవమానించవద్దని ప్రధాని మోదీ కోరారు. సామాజిక న్యాయంతోనే పటిష్టమైన సమాజం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

సామాన్యుడి ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే రూ. 350 విలువైన ఎల్‌ఈడీ బల్బులను రూ. 50కే ఇస్తున్నామని, ఎల్‌ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్‌ ఆదా అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రెండేళ్లలో 18వేలకుపైగా గ్రామాలకు విద్యుత్‌ ఇచ్చామని తెలిపారు. ఢిల్లీ నుంచి మూడు గంటల ప్రయాణ దూరంలో వున్న గ్రామానికి విద్యుత్ పరఫరాను అందించేందుకు 70 ఏళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అయితే తాము అధికారంలోకి రాగానే అగ్రామానికి విద్యుత్ అందించామన్నారు. జన్‌ధన్ పథకం అమలు అసంభవం అన్నారని, 21 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రెండేళ్లపాటు కరువు వచ్చినా తట్టుకోగలిగామని, ద్రవ్యలోటు పెరగకుండా జాగ్రత్త పడ్డామని వెల్లడించారు.

చట్టంలో మార్పులు తేకుండానే పని విధానం మెరుగైందన్నారు. గతంలో చాలా వరకు ప్రాజెక్ట్‌లను పునాది వేసి వదిలేశారని, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని, ప్రజధనం వృథా కాకూడదనే ప్రాజెక్ట్‌లను కొనసాగిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు బిటి రోడ్లు వేయించాలని తమ ప్రభుత్వం నిశ్చయించుకుందని, ఇందులో భాగంగా తాము అధికారంలోకి రాగానే చర్యలను చేపట్టామన్నారు. తొలుత 60 నుంచి 70 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని, దానిని మరింత వేగవంతం చేసి ప్రస్తుతం రోజుకు 100 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతూ.. అనేక గ్రామాలకు మెరుగైన రోడ్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఆయా గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కూడా కలుగుతుందని ప్రధాని చెప్పారు.

ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు

* టెక్నాలజీతో జనజీవనంలో మార్పులు తేవాలి
* సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం
* ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం
* ఒకటి, రెండు వారాల్లోనే పాస్‌పోర్ట్‌ పొందగలుగుతున్నాం
* ఒక్క నిమిషంలో 15 వేల టిక్కెట్లు ఇచ్చేలా రైల్వేను ఆధునీకరించాం
* నిరుపేదలకు రైలు ప్రయాణమే ఆధారం
* పారిశ్రామిక విధానాల్లో అనేక మార్పులు చేశాం
* వైద్య వ్యవస్థలో సమూల మార్పులు చేశాం
* జన్‌ధన్‌ యోజన పథకంతో 21 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు
* రైతులకు నీళ్లిస్తే మట్టిలో బంగారం పండిస్తారు
* రెండేళ్లు కరువు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Prime minister  Narendra Modi  flag hoisting  independence day  red fort  

Other Articles