special investigating team chief nagireddy shared some more details of nayeem with media

Gangster nayeem implimented several plans to escape from police

gangster nayeem, tollywood nayeem, nayem tollywood, nayeem bedroom, nagireddy, SIT, female, murder cases, nayeemuddin, sit, special investigation team, IG nagireddy, currency bundles, land documents, mahaboobnagar, Telangana, crime

special investigating team chief nagireddy shared some more details with media says, nayeem implimented several plans to escape from police

పోలీసుల కళ్లు గప్పి తిరిగేందుకు నయీం అలా కూడా..

Posted: 08/13/2016 04:47 PM IST
Gangster nayeem implimented several plans to escape from police

పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరిగేందుకు గాను గ్యాంగ్స్టర్ నయీం వేషధారణ మార్చి కూడా సంచరించాడని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల విచారణలో వెల్లడైంది. నయీం అమ్మాయిల రూపంలోనూ, బురఖా వేసుకుని, ఇంకా అనేక వేషాల్లో తిరిగాడని సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం సమావేశనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ....అమ్మాయిల వేషధారణలో నయీం తిరిగిన ఫోటోలను త్వరలో విడుదల చేస్తామన్నారు.

నయీం ఆగడాలపై సిట్ కంట్రోల్ రూమ్కు శనివారం ఒక్కరోజే 60 ఫిర్యాదులు అందాయని నాగిరెడ్డి చెప్పారు. బాధితులను స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేయమని సూచించమన్నారు. ఈ కేసులను సిట్కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. నదీం అలియాస్ ఉదయ్ కుమార్, నస్రీన్, హీనా, చియాన్ల అదృశ్యం వెనుక నయీం హస్తముందన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఏలాంటి ఫిర్యాదులు కూడా అందలేదన్నారు. మహిళలను, చిన్నారులను మానవకవచాలుగా నయీం వాడుకున్నాడని ఆయన తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా నయీంకు చెందిన 20 ఇళ్లు గుర్తించామని...ఆ ఇళ్లల్లో సోదాలకు కోర్టు అనుమతి కోరుతున్నామన్నారు.  నయీం ప్రధాన అనుచరులు టెక్ మధు, కుమారస్వామిలను శుక్రవారం అరెస్టు చేశామని...నయీం వ్యవహారాల్లో వీరిద్దరూ కీలకమన్నారు.  నయీం ఆస్తులపై శుక్రవారం విలువైన సమాచారం అందిందన్నారు. కోరుట్ల, కరీంనగర్లో నాలుగు బెదిరింపు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. నయీం నేరాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు, సమాచారం ఇవ్వదలచిన వారు 94406 27218 నంబర్కు సంప్రదించవచ్చునని నాగిరెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nayeem  gangster  nagireddy  SIT  female  murder cases  crime  

Other Articles