Freedom to start its budget LED TV bookings on Independence Day

Ringing bells led tv pre booked begins on 15th august

freedom 251 maker,world's cheapest smartphone maker,freedom 9900 led tv,cheapest hd led tv india,ringing bells television,ringing bells tv prebooking,freedom 9900 bookings,freedom 9900 sales,independence day offers,where to buy freedom 9900

Noida-based Ringing Bells announced on Friday that it will finally start the booking of its first budget HD LED TV on Monday, August 15, which is the 70th Indian Independence Day.

రింగింగ్ బెల్స్ నుంచి మరో చౌకధర ఉత్పాదన..

Posted: 08/12/2016 09:25 PM IST
Ringing bells led tv pre booked begins on 15th august

అత్యంత చౌకధరలో స్మార్ట్ ఫోన్ ఇస్తామని ప్రకటించి.. యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసిన సంస్థ గుర్తుందా..? అదేనండీ అత్యంత తక్కువ ధరకు ఖరీదైన  ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనానికి తెరలేపిన రింగింగ్ బెల్స్ సంస్థ. అయితే అదిలోనే నిష్టూరాలకు పోయి విమర్శల పాలైన ఈ సంస్థ ఆ తరువాత స్మార్ట్ పోన్లను మాత్రం బుకింగ్ చేసిన వారికి అందించడంతో విమర్శలను తిప్పికోట్టగలిగింది. ఇదిలా వుండగానే పడిలేచిన కెరటంలో మరో అధునాతన ఉత్పాదనతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చేసింది.

అత్యంత చౌకధరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులను అందుబాటులోకి తీసుకోస్తుందని ప్రముఖ్యతను సోంతం చేసుకున్న రింగింగ్ బెల్స్ మరో ఉత్సాదనను కూడా చౌకధరకు అందిస్తామని ప్రకటన విడుదల చేసింది. అదేంటంటూ ఈ సారి అంత తక్కువ ధరతో ప్రజలను ఆశ్చర్యంలోకి ముంచెత్తనప్పటికీ ప్రస్తుత మార్కెట్ తో పాల్చితే మాత్రం రమారమి చౌకధర అని చెప్పక తప్పదు. అసలేంటి ఆ ఉత్పాదన అంటున్నారు కదూ..? అదే ఫ్రీడం హై డెఫినెషన్ ఎల్సీడీ టీవీలు. అంటే వాటి ధర ఎంత అని అడుతున్నారు కదూ.

మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వుండేందుకు వీలుగా 10 వేల లోపే  చీసెప్ట్ హెచ్డీ ఎల్ఈడీ టీవీ అంటూ మరో సంచలనాత్మక ప్రకటన చేసింది. తమ కొత్త 'ప్రీడమ్ 9900'  టీవీలకోసం ఆగస్టు 15న బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటన చేసింది. నోయిడా ఆధారిత ఈ స్మార్ట్ ఫోన్ మేకర్ 31.5 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టీవీలను రూ. 9,900లకే అందించనున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 15 న బుకింగ్ మొదలవుతుందనీ, తరువాతి రోజు నుంచి (ఆగస్టు 16 ) పంపిణీ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

క్యాష్  ఆన్ పద్ధతిలో  వీటిని డెలివరీ చేయనున్నట్టు  రింగింగ్ బెల్స్  ఒక ప్రకటనలో వెల్లడించింది. 1366x768 పిక్సెల్స్, రిజల్యూషన్,  3000 కాంట్రాస్ట్ రేషియో,  రెండు హెచ్ డీ ఎంఐ పోర్ట్సు, రెండు యూసీబీ పోర్టులు,  రెండు స్పీకర్ల  తదితర ఫీచర్లు దీని  సొంతం. అసక్తివున్నవారు సంస్థ వెబ్ సైట్ ringingbells.co.in (రింగింగ్బెల్స్ .కో.ఇన్) వెబసైట్ లో బుకింగ్ లు చేసుకోవచ్చు. తమ ఫ్రీడమ్  స్మార్ట్ ఫోన్ మాదిరిగానే  తమ టెలివిజన్ కు కూడా మంచి స్పందన వస్తుందని కంపెనీ భావిస్తోంది.  ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సరసమైన ధరలో నాణ్యమైన ఉత్పత్తిని  అందిస్తామనే భరోసా వినియోగదారులకు ఉందని పేర్కొంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 32 inch hd led tv  pre-booking  ringing bells  freedom led tv  technology  computing  internet  

Other Articles