గూగుల్ మేనేజర్ గా పని చేస్తున్న 27 ఏళ్ల రేప్ అండ్ మర్డర్ కేసు అమెరికాలో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె మృతదేహం చెట్ల పక్కనున్న పొదలో బట్టలు లేకుండా సగం కాలిన స్థితిలో దొరకడం తెలిసిందే. న్యూయార్క్ గూగుల్ బ్రాంచ్ లో మేనేజర్ గా పని చేస్తున్న వెనెస్సా మర్కొటీ అతి కిరాతకంగా హత్యాచారానికి గురికావడం, ఆపై సజీవ దహానం చేశారని విచారణలో తేలింది..
వీకెండ్ కావటంతో వెన్నెసా మసాచుసెట్స్ లోని ప్రిన్స్ టన్ లో ఉంటున్న తన తల్లి దగ్గరకు వెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం భోజనం తర్వాత జాగింగ్ కు వెళ్లిన వెనెస్సా ఎంతసేపటికీ తిరిగి రాలేదు. కంగారుపడిన ఆమె తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు స్నిఫర్ డాగ్స్ తో ఆమె జాగింగ్ చేసిన ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. కుక్కలు సమీపంలోని గ్రామీణ ప్రాంత రహదారిలో పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లాయి. అక్కడ వెన్నెసా సగం కాలిన మృతదేహం లభ్యమైంది.
ఒంటిపై దుస్తులేని ఆ మృతదేహం కాలిపై గాయాలు ఉండడంతో...ఆమెను రేప్ చేశారని, గుర్తుపట్టకుండా ఉండేందుకే ఆమెను కాల్చేశారని పోలీసులు అనుమానించారు. పోస్టు మార్టం నివేదిక వారి అనుమానాలను నిజమని వెల్లడించింది. ఆమె దారుణమైన రీతిలో అత్యాచారానికి గురైందని తేలింది. అయితే ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డవారు ఎంతమంది అనే విషయాన్ని నివేదికలో సైతం బయట పడకపోవటం విశేషం. ఈ విషయంలో నేరస్థులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆమె తల్లి ఉద్యమాన్ని లేవదీస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more