Isis terrorist killed at shadnagar in encounter

Isis terrorist killed at shadnagar in encounter

terrorist killed in shadnagar, terrorist in millineum township, terrorist killed in mahaboobnagar, basha terrorist, isis terrorists, shad nagar, mahaboobnagar, NIA, Army, para military forces, Telangana

Isis terrorist killed at shadnagar millenium township in encounter, as one of supporter gives hostage to them

షాధ్ నగర్ లో ఉగ్రకలకలం.. కాల్పులతో దద్దరిల్లుతున్న పట్టణం

Posted: 08/08/2016 10:23 AM IST
Isis terrorist killed at shadnagar in encounter

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని టార్గెట్ చేశారా..? లేక ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను లక్ష్యంగా చేసుకున్నారా..? లేక భారత్ లో తమ ఉనికి చాటాలనకుంటున్నారో తెలియదు కానీ.. ఏకంగా హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వున్న మహభూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా సరిహద్దుకు అనుకుని వున్న షాద్ నగర్ లో ఉగ్రవాదులు కలకలం రేపారు. స్థానికంగా తలదాచుకున్న ఉగ్రవాదులు అక్కడి నుంచి ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖయలో అక్కడకు చేరుకుని తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు తప్పించుకునేందుకు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఎంత మంది ఉగ్రవాదులు ఆ ఇంట్లో నక్కి ఉన్నారన్న విషయమై సమాచారం లేనప్పటికీ, ఓ ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షాద్ నగర్ లని మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న ఆలోచనతో మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు, బాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టు పక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. బాషా అనే వ్యక్తికి చెందిన ఇంట్లో వీరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎన్ఐఏతో పాటు గ్రేహౌండ్స్, పారామిలటరీ బలగాలు సైతం హుటాహుటిన షాద్ నగర్ కు తరలివెళ్లాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis terrorists  shad nagar  mahaboobnagar  NIA  Army  para military forces  Telangana  

Other Articles