Narendra Modi Inaugurates Super Thermal Power Project, assures cooperation to Telangana

Prime minister narendra modi launches mission bhagiratha in medak

pm narendra modi, telangana visit, komati banda, mission bhagheeradha, cm kcr, gajwel meeting, venkaiah naidu, piyush goel, suresh prabhu, anath kumar, governer narsimhan, harish rao, swamy goud

Prime Minister Narendra Modi launched Mission Bhagiratha, Telangana government’s dream project aimed to supply piped drinking water to every household in the state.

నీటి విషయంలో కేసీఆర్ భావోద్వేగి.. మిషన్ భగీరథ అవిష్కరణ సభలో మోడీ

Posted: 08/07/2016 05:04 PM IST
Prime minister narendra modi launches mission bhagiratha in medak

తెలంగాణను ప్రధాని నరేంద్రమోదీ రెండేళ్ల పసిబిడ్డగా అభివర్ణించారు. తెలంగాణలో ఇదే తన తొలి పర్యటన అంటూ.. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయన.. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని, దీన్నే సహకార సమాఖ్య అంటారని పేర్కొన్నారు. ప్రజల స్పందన చూసి ముగ్దుడినైపోతున్నానని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణ భవిష్యత్‌ తన కళ్ల ముందు కన్పిస్తోందని చెప్పారు. రాజకీయ పండితులు తెలంగాణ భవిష్యత్‌ను మరో కోణంలో చూడాల్సిందేనని ఆయన చెప్పారు.

మిషన్ భగీరథ మహత్తర కార్యక్రమం అని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ని చూస్తే నీళ్లే ఆయన జీవిత లక్ష్యమని ప్రశంసించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ గజ్వేల్‌లోని ప్రారంభోత్సవ ప్రాంగణానికి చేరుకోగా.. ఆయనకు వేద పండితులు వేదమంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. వారి మంత్రోచ్చరణల మధ్యే అయన మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం గోదావరి జలాలను నల్లా తిప్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పంచభూతాల్లాగా ఈరోజు ఐదు ప్రాజెక్టులను ప్రారంభించానని, రైతులకు నీళ్లు ఇస్తే మట్టిలో బంగారం పండిస్తారని మోదీ పేర్కొన్నారు.

గుజరాత్‌లో కచ్ ప్రాజెక్ట్‌లాగా తెలంగాణలో తాగునీటి ప్రాజెక్ట్ చేపట్టానని కేసీఆర్ తనతో చెప్పేవారని ఆయన అన్నారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాలంలో యూరియా కొరతపై ఏ సీఎం కూడా లేఖ రాయలేదని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఎరువుల కొరత లేదని, ధరలు బాగా తగ్గాయని అన్నారు. విద్యుదుత్పత్తికి పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్త రోజుల్లో యూనిట్ విద్యుత్ రూ.11 ఉండేదని, కానీ ఇప్పుడది రూపాయి పదిపైసలు తగ్గిందని మోదీ గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm narendra modi  telangana visit  komati banda  mission bhagheeradha  cm kcr  gajwel meeting  

Other Articles