Telangana dusts off new district plan; K Chandrasekhar Rao to meet officials

Telangana new districts primary notification on 10

telangana cm, KCR, k.chandrashekar rao, new districts, PM Modi, Narendra modi, modi telangana visit, Modi, dasara, primary notification, new districts from dasara, new districts notification,

The state government’s plans to announce new districts from Dasara is heading to release primary notification on 10 august.

10న తెలంగాణ కొత్త జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్..?

Posted: 08/05/2016 01:54 PM IST
Telangana new districts primary notification on 10

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన తర్వాతే జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. జిల్లాల ఏర్పాటుపై పదో తేదీన ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తోంది. గజ్వేల్‌లో మిషన భగీరథను ప్రధానమంత్రి ఆదివారం(7వ తేదీ) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో కొత్త జిల్లాలు, వాటికి కావాల్సిన నిధులు, అధికారులపై ప్రధానిని కోరాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఆ తర్వాతే జిల్లాలపై దృష్టిసారించాలని భావిస్తున్నారు.

ముందుగా ఈ నెల 4 లేదా 10వ తేదీల్లో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కారు యోచించింది. అయితే.. 4వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. దీంతో  కొత్త జిల్లాలపై ఈ నెల 10న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడుతుందని రెవెన్యూ వర్గాల అంటున్నాయి. ఈ నెల 9వ తేదీన కలెక్టర్లు, విభాగాధిపతులు, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ), రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారని అధికార వర్గాల సమాచారం.

చకచకా కసరత్తు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే ముసాయిదా విడుదలైన నేపథ్యంలో జిల్లాస్థాయి శాఖలన్నీ శాఖల పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించాయి. శాఖలను, ఉద్యోగులను ఏ విధంగా విభజించాలి... సర్దుబాటు వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నాయి. వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌ను జిల్లా చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం వ్యక్తం చేసింది. దాంతో ఆ పట్టణంలో ప్రతిపాదిత కలెక్టరేట్‌ భవనానికి రోడ్డు పనులకు ఇటీవలే టెండర్లు కూడా పిలిచారు. మరోవైపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలను కలిపి మూడు జిల్లాలు చేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి పేరుతో వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా ఒక జిల్లా మాత్రమే చేయనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులంతా జిల్లా యూనిట్‌గా మూడు జిల్లాలు చేయాలని బలంగా పట్టుబడుతున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కె.కేశవరావుతో కూడా చర్చించారు. అయితే వీటిని తోసిపుచ్చుతూ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జిల్లాలపై సమగ్రంగా మ్యాపులు సిద్ధం చేయాలని రెవెన్యూశాఖ జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరిగితే శాఖలను, ఉద్యోగులను ఏ విధంగా విభజించాలి... సర్దుబాటు వంటి అంశాలపై మెదక్‌, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం శాఖలకు సూచనలు చేసింది.

రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రతిపాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లాను ముసాయిదా నుంచి తొలగించింది. కొత్తగా తెరపైకి వచ్చిన నిర్మల్ జిల్లా ఏర్పాటు అంశాన్ని సైతం పక్కకు పెట్టింది. దీంతో ప్రస్తుత మున్న పది జిల్లాలకు అదనంగా మంచిర్యాల (కొమురంభీం), జగిత్యాల, భూపాలపల్లి (ఆచార్య జయశంకర్), మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి(భువనగిరి), కొత్తగూడెం, సికింద్రాబాద్ కొత్త జిల్లాలుగా ఏర్పడుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా పునర్వవ్యస్థీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల భౌగోళిక స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు వీలుగా మొత్తం 23 జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే మండలాల జాబితాతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్తగా 74 మండలాలను ఏర్పాటు చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm  KCR  new districts  Modi  dasara  primary notification  

Other Articles