టీచర్ల ట్రాన్స్ ఫర్ ఆపడానికి ఎంత సాహసం చేశాడంటే... | Student's SMS leads Karnataka govt to revoke teachers' transfer

Student s sms leads karnataka govt to revoke teachers transfer

Student's SMS in Karnataka, One SMS leads revoke teachers' transfer, Divith U. Rai SMS, Student SMS to Home Minister, I’m the home minister of my school council. Can I speak to you for five minutes?

Student's SMS leads Karnataka govt to revoke teachers' transfer.

గురువుల కోసం ఆ విద్యార్థి ఏం చేశాడంటే...

Posted: 08/05/2016 12:35 PM IST
Student s sms leads karnataka govt to revoke teachers transfer

తనతోపాటు 432 మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న ఓ 8వ తరగతి విద్యార్థి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకకు చెందిన 13 ఏళ్ల దివిత్ రాయ్ చేసిన పనికి ఏకంగా ఆ రాష్ట్ర హోం మంత్రి దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు... ఎందుకు చేశాడు? అన్నది పరిశీలిస్తే...

కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్యే టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణ కన్నడ జిల్లా, హరది గ్రామంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో నలుగురు టీచర్లను వేరే స్కూల్ కి బదిలీ చేశారు. అయితే ఇంత కాలం తమకు విద్యాబుద్ధులు అందించిన గురువులు తమను వీడి వెళ్తున్నారన్న విషయాన్ని అదే స్కూల్లో చదువుతున్న దివిత్ రాయ్ తట్టుకోలేకపోయాడు. వారిని వెళ్లొద్దంటూ బతిమిలాడాడు. అదంతా ప్రభుత్వం చేతుల్లో ఉన్న వ్యవహారమని, తమ చేతుల్లో ఏం లేదని వారంతా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, మొండిపట్టు ఉన్న ఆ పిల్లాడు అస్సలు వదల్లేదు.

హోంమంత్రి కార్యాలయం ప్రజలతో మమేకం అయ్యేందుకు ఒక ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారని విన్నాడు. అంతే ఒక వాయిస్ మెసేజ్ ను ఆ నంబర్ కు పంపాడు. “I’m the home minister of my school council. Can I speak to you for five minutes?” (‘మా పాఠశాల కౌన్సిల్‌కు నేనూ హోం మినిస్టర్‌నే. నేనో ఐదు నిమిషాలు మీతో మాట్లాడవచ్చా?’ ) అంటూ అందులో పేర్కొన్నాడు. ఆ సందేశం అందుకున్న మంత్రిత్వ శాఖ విషయాన్ని మంత్రి పరమేశ్వరకు చేరవేశారు. మంత్రి ఆదేశాల మేరకు వెంటనే ఆయన కార్యాలయం నుంచి దివిత్ కి ఫోన్ వచ్చింది. ‘సర్ మా టీచర్లను బదిలీ చేయాలని మీరు తీసుకున్న నిర్ణయం నాతోసహా ఎంతో మంది విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. టీచర్లు వెళ్లిపోతే దాని ప్రభావం పిల్లల చదువులపై కూడా పడుతుంది. దయచేసి బదిలీలను ఆపివేయండ’ని కోరాడు.

పూర్తి విషయం అవగాహనకు వచ్చిన మంత్రి వెంటనే తానే స్వయంగా విద్యాశాఖ మంత్రికి తన్వీర్ కు ఫోన్ చేసి వెంటనే ఆ ఆదేశాలను నిలిపేలా చూడాలని కోరాడు. వ్యవహారం మీడియాలో హైలెట్ కావటంతో స్థానిక ఎమ్మెల్యే కూడా పాఠశాలను సందర్శించి విద్యాశాఖ అధికారితో మాట్లాడి ఆదేశాలను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చాడు. చివరికి ఏదైతేనేం ఆ నలుగురి టీచర్ల బదిలీ ఆపేసిన ప్రభుత్వం వారిని అదే పాఠశాలలో కొనసాగుతారని తెలిపింది.

‘తన చదువుపట్ల, తోటివారి భవిష్యత్తుపట్ల దివిత్‌కు ఉన్న దృక్పథం పట్ల అధికారులు, విద్యార్థల తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Divith U. Rai  SMS  Home Minister  Parameswar  revoke  teachers' transfer  

Other Articles