BJP, PM Modi could kill me and you: Arvind Kejriwal's warning to AAP MLAs

Pm modi may try to have me killed arvind kejriwal claims in video

Delhi CM, Aravind Kejriwal, Prime Minister, PM Modi, Naredra Modi, allegations, Jhaadu, Broom, AAP Symbol, Road Show, Jhaadu Chalao Yatra, Arvind Kejriwal v/s Narendra Modi

PM Narendra Modi is "so frustrated that he can get me killed," Arvind Kejriwal has said in a 10-minute video in which he catalogues his government's many points of dispute with the centre.

ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు.. అవసరమైతే చంపేస్తారేమో..

Posted: 07/28/2016 10:30 AM IST
Pm modi may try to have me killed arvind kejriwal claims in video

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై సంచలన ఆరోపణ చేశారు. తాము కేంద్రానికి పక్కలో బల్లెం మాదిరిగా వున్నామని.. తమను అనునిత్యం అణిచివేతకు గురిచేస్తున్నారని అరోపించారు. తాము కేంద్రం నియంతృత్వ దోరణిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నేపథ్యంలో ప్రధాని తమను చంపేస్తారేమోనన్న అందోళనను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రధాని సహా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తమపై చేస్తున్న అసాధారణ అణచివేతను ఎదుర్కోనేందుకు అప్ ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్దంగా వుండాలని ఆయన సూచించారు.

ఢిల్లీలో అప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడాదిన్నర కాలంలో తమపై జరుగుతున్న దాడులను ఆయన ప్రస్తావించారు. ఆప్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్ని ప్రస్తావిస్తూ పార్టీ  కార్యకర్తలకు వీడియో సందేశమిచ్చారు. దాడుల సూత్రధారి ప్రధాని నరేంద్ర మోదీనేనన్నారు. ‘ఆప్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇది సంక్లిష్ట సమయం. రానున్న రోజుల్లో ఇది మరింత దారుణంగా ఉండొచ్చు. ఆయన (మోదీ) మనల్ని చంపించేదాకా వెళ్లొచ్చు. నన్నూ చంపించవచ్చు. ఎమ్మెల్యేలందరినీ జైలుకు పంపొచ్చు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో వున్నారని, అయితే వారిని శాంతింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు బదులు ప్రభుత్వం ప్రతిపక్షాల నోరుమూయించి.. అసలు అసంతృప్తే లేదని చేయాడానికి ప్రణాళికలు రచిస్తుందని ఆయన అరోపించారు.

మీ కుటుంబాలతో మాట్లాడి ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉండండి. ఈ కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడితే మాతో ఉండండి. లేకపోతే మమ్మల్ని వదిలిపెట్టండి’ అని  చెప్పారు. ఇప్పటిదాకా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ ఇంటిపై ఆదాయ పన్ను  అధికారులు సోదా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం చేతిలో వున్న సిబిఐ, అదాయపన్నుశాఖ, పోలీసులు వుండటం చేత వాటితో తమను అణిచివేయాలని ప్రయత్నాలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాగుతూనే వున్నాయన్నారు. తాము ఎక్కడా కేంద్రానికి దొరకడం లేదని చిన్న చితక కేసులను కూడా టార్గెట్ గా చేసుకుని తమ ఎమ్మెల్యేలపై కేసును బనాయించి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. కాగా, ఆప్ నేతలు  నేరాలకు పాల్పడకుండా అరికట్టడంలో విఫలమై.. ప్రధానిపై సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని  కేజ్రీని బీజేపీ విమర్శించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi CM  Aravind Kejriwal  Prime Minister  PM Modi  Naredra Modi  allegations  

Other Articles