ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 ఎక్కడుంది? | massive search operation for missing military plane

Massive search operation for missing military plane

missing military plane AN-32, missing Indian military plane, AN-32 bay of bengal, missing Indian plane, missing military plane debris

Massive search operation for missing military plane AN-32 with 29 crew.

గల్లంతైన ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కడుంది?

Posted: 07/23/2016 12:27 PM IST
Massive search operation for missing military plane

24 గంటలు గడుస్తున్నప్పటికీ గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం 'ఏఎన్-32' ఆచూకీ ఇంకా లభించలేదు. సమయం గడుస్తున్న కొద్ది ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. వైమానికి.. నౌక దళంతో పాటు.. జాతీయ విపత్తు నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ భారీ సెర్చ్ ఆపరేసన్ లో  12 యుద్ధ నౌకలు.. రెండు డార్నియర్ యుద్ధవిమానాలు.. హెలికాఫ్టర్లు.. రెండు పీ8ఐ నిఘా విమానాలను వినియోగిస్తున్నారు. చెన్నై నుంచి కడలూరు పర్యవేక్షణ పనుల కోసం వెళ్లిన ఈ చిన్నపాటి విమానం బయలుదేరి కాసేపటికే గల్లంతైంది. తాంబరం నుంచి టేకాఫ్ అయిన 16 నిమిషాలకే కంట్రోల్ స్టేషన్ నుంచి సంబంధాలు తెగిపోయింది.  మొత్తం 29 మంది ఉండగా వీరిలో తొమ్మిది మంది విశాఖకు చెందిన వారు.

పోర్ట్ బ్లెయిర్ లో తుపాకులకు అవసరమయిన మరమ్మతులు చేయటానికి విశాఖకు చెందిన నిపుణులైన నేవీ సిబ్బంది ఆరుగురు నుంచి 50 మంది వరకూ బృందాలుగా తరచూ పంపిస్తుంటారు. అక్కడి అవసరానికి తగ్గట్లు రెండు రోజుల నుంచి నెలన్నర వరకూ కూడా సిబ్బంది సేవలు అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం వీరంతా బయలుదేరారు. విమానంలో కేవలం నాలుగు గంటలు ప్రయాణించేందుకు అవసరమైన ఇంధనం ఉంది. తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు మధ్య ప్రయాణం రెండు గంటలు మాత్రమే కావటం గమనార్హం.  

ఏటీసీతో సంబంధాలు కోల్పోయే సమయానికి విమానం భూమికి 23వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ మధ్య దూరం 1200 కిలోమీటర్లు కాగా.. చెన్నై నుంచి 300 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గల్లంతైన విమానం కోసం  శ్రీలంక.. మలేషియా.. సింగపూర్ దేశాలు సాయం చేస్తామని స్వచ్ఛందంగా ముందుకు రావటం విశేషం.

ఒకవేళ సముద్రంలోకి కానీ విమానం కూలిపోయి ఉంటే.. కూలిన వెంటనే తన ఆచూకీని చెప్పేసిగ్నల్స్ ను అందుకోవటానికి వీలుగా జలాంతర్గామిని ఉపయోగిస్తున్నారు. ఇక గాలింపు చర్యలను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కాసేపట్లో చెన్నై వెళ్లనున్నట్లు సమాచారం. విమానం ఆచూకీని తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీయనున్నారు.

ఏఎన్-32 గురించి...

రష్యా టెక్నాలజీతో రూపొందించిన ఎఎన్-32 విమానాన్ని 1976 జులైలో మనదేశానికి తీసుకొచ్చారు. ఎంత చిన్న ప్రాంతంలో అయినా టేకాఫ్ తీసుకోగలగడమే వీటి ప్రత్యేకత. 16880 కేజీలు ఉన్న ఈ విమానం టేకాఫ్ వెయిట్ 27వేల కేజీలు. 6.7 టన్నుల సరుకుల్ని మోసుకెళ్లగలదు. గంటకు గరిష్ఠంగా 530కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఈ తరహా విమానాలు దాదాపు వంద వరకూ ఉన్నాయి. ఒకసారి ఇంధనాన్ని నింపితే నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఎగరగలదు. భారత్ లో ఇప్పటివరకూఈ తరహా విమానాలు 11 సార్లు ప్రమాదానికి గురైతే.. ఇప్పటివరకూ 100 మందికి పైగా మరణించారు. కాగా, తాజాగా అదృశ్యమైన విమానం ఏఎన్-32 ఈ నెలలోనే మూడుసార్లు సమస్యలు తెల్తెతినట్లుగా నేవీ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAF plane  miss  AN-32  

Other Articles