Suspect 18-year old ‘Iranian from Munich’, public transport resumes as manhunt ends

German iranian gunman kills at least nine in munich shopping mall

Munich, germany, munich shooting, shopping center shooting munich, German-Iranian, shopping center munich, germany attack, germany attack shopping center, Munich, shooting, shopping center, Olympia Einkaufszentrum, germany

German Police say they cannot confirm about any other gunfire, apart from that Olympia Mall attack. Ask people not to spread speculation.

జర్మనీ షాపింగ్ మాల్ లో కాల్పులు.. 9 మంది మృతి

Posted: 07/23/2016 07:20 AM IST
German iranian gunman kills at least nine in munich shopping mall

జర్మనీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధులైన దుండగలులు ఓ షాపింగ్ మాల్ లోకి చోరబడి అక్కడున్న కస్టమర్లపై కాల్పులతో తెగడ్డారు. ఈ కాల్పులలో తొమ్మిది మంది పౌరులు మృతి చెందగా, మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. జర్మనీలో మూడో అతిపెద్ద నగరం మ్యూనిచ్ లోని ఓ ఒలంపియా షాపింగ్ సెంటర్ లోని మెక్ డోనాల్డ్ రెస్టారెంట్ లోకి చొరబడ్డ దుండగులు ఒక్కసారిగా కొనుగోలుదార్లపై కాల్పులకు తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది షాపింగ్ సెంటర్ ను చుట్టుముట్టి దుండగుడ్ని మట్టుబెట్టారు.

షాపింగ్‌మాల్‌తో పాటు నగరంలోని పలుచోట్ల కూడా దుండగులు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. షాపింగ్ మాల్ చుట్టూ మూడు స్కూటర్లు పార్క్ చేసి వున్నట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా కాల్పులు జరిపింది మాత్రం కేవలం ఒక్క దుండగుడని, అతను మెక్ డోనాల్డ్ బెకరీలోని రెస్టు రూమ్ లోకి వెళ్లి తుపాకిని లోడ్ చేస్తున్నట్లు తమ పిల్లలు తమకు చెప్పారని సాక్షులు చెప్పారు. అయితే కాల్పులు జరిపిన అగంతకుడిని ఉగ్రవాదులు మట్టుబెట్టారు. ఈ కాల్పుల్లో సాయుధుడితో పాటు మొత్తం పది మంది మరణించారని, 20 మంది క్షతగాత్రులయ్యారని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు.

కాల్పులకు తెగబడింది జర్మన్ ఇరనీయన్ యువకుడని, అతనికి కేవలం 18 ఏళ్లు మాత్రమే వుంటాయని పోలీసులు గుర్తించారు. కాగా అతనికి ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధాలు వున్నట్లు తమ ప్రాథమిక దర్యాప్లులో తేలలేదని, అయితే ఘటనకు దారి తీసిన కారణాలను పూర్తి దర్యాప్తు తరువాత కానీ వెల్లడించలేవమని పోలీసు అధికారులు చెబతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) షాపింగ్ మాల్ లో కాల్పుల శబ్ధం వినిపించిందని జర్మన్ పోలీస్ అధికారులు తెలిపారు.

మరోవైపు షాపింగ్ మాల్ ఉన్న మూసాచ్ డిస్ట్రిక్ లో తాత్కాలిక ఎమర్జెన్సీ  ప్రకటించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పుర పౌరులను ఎక్కడికక్కడ ఇళ్లలోనే వుండాల్సిందిగా అదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు. దీంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను కూడా రద్దు చేశామన్నారు. కాల్పుల శబ్ధం వినబడగానే జనం బయటికి పరుగులు తీసిన దృశ్యాలతోపాటు వ్యక్తి చనిపోయిన ఫొటో ఒకటి సోషల్ మీడియా ద్వారా షేర్ అయింది. ఘటన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని రకాలుగా పకడ్భందీ చర్యలను తీసుకున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Munich  shooting  shopping center  Olympia Einkaufszentrum  germany  

Other Articles