Karnataka cop suicide: Minister KJ George resigns after court orders FIR

Kj george resigns for minister post

KJ George, Karnataka cop suicide, M K Ganapathy, DySP, Nehal Ganapathy, A M Prasad, Pranab Mohanty

Minister K J George resigned after a Bengaluru court directed the police to file an FIR against him and two top police officials in connection with the suicide of DySP M K Ganapathy.

సెకెండ్ వికెట్: మంత్రి పదవికి జార్జి రాజీనామా..

Posted: 07/19/2016 09:15 AM IST
Kj george resigns for minister post

కర్ణాటక పోలీసు అధికారులతో వైరం పెట్టుకుని వారి వేధించారన్న అరోపణలతో మరో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల బళ్లారీకి చెందిన డిఫ్యూటీ ఎస్పీ అనుపమా షెనాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పై అనంతరం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వేటు వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో డీఎస్సీ గణపతి అత్మహత్య కేసులో బెంగుళూరు అభివృద్ది శాఖ మంత్రి కేజే జార్జి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కర్నాటక డిప్యూటీ ఎస్‌పి ఎం.కె.గణపతి ఆత్మహత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాల్సిందిగా మడికెరి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గణపతి ఆత్మహత్య ఘటనపై ఆయనతోపాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఏఎం ప్రసాద్, ప్రణబ్ మొహంతిలపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని కొడగు పోలీసులను మడికెరి అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అన్నపూర్ణేశ్వరి ఆదేశించారు.

ఈ నెల ఏడో తేదీన ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్న గణపతి.. తాను రాసి పెట్టుకున్న సూసైడ్ నోట్‌లో మంత్రి జార్జి, ఐపీఎస్ అధికారులు ఏఎం ప్రసాద్, ప్రణబ్ మొహంతి తనను వేధిస్తున్నారని ఆరోపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆత్మహత్యకు ముందు ఒక ప్రైవేట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సహా ఇద్దరు పోలీసు శాఖ ఉన్నతాధికారుల తనను వేధిస్తున్నారని, తనకేం జరిగినా మంత్రి జార్జి, ఇద్దరు ఐపీఎస్ అధికారులదే బాధ్యత అని గణపతి ఆరోపించారు. అ ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఈ ఘటనపై కేసు నమోదు కోసం ఈ నెల 10న కుషాలనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళితే పోలీసులు అందుకు నిరాకరించారని గణపతి భార్య పవన, కుమారుడు నెహల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న నిందితులు కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరని, వారిపై ఐపీసీలోని 306, 34 సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదుచేయాలని కోరారు. నెహల్ తరఫున వాదించిన న్యాయవాది ఎంటీ నానయ్య మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు అధికారులు జార్జి, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. వారి దర్యాప్తుతో సంబంధం లేకుండా నిందితుల అరెస్ట్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు.

దీంతో తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన అధికారులు, మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గణపతి కుమారుడు నెహల్ గణపతి దాఖలుచేసిన ప్రైవేట్ పిటిషన్‌ను విచారణకు మేజిస్ట్రేట్ విచారణకు స్వీకరించారు. మేజిస్ట్రేట్ ఆదేశాల తర్వాత అసెంబ్లీలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు జగదీశ్‌షెట్టర్ స్పందిస్తూ జార్జి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఈ కేసు నిష్పక్షపాత దర్యాప్తు కోసం ప్రభుత్వం సదరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KJ George  Karnataka cop suicide  M K Ganapathy  DySP  Nehal Ganapathy  A M Prasad  Pranab Mohanty  

Other Articles