Hardik Patel, Patidar quota stir leader, released from jail

Hardik patel released from jail gets hero s welcome

Hardik Patel, Patel agitation, Gujarat quota agitation, Patel stir in Gujarat, Hardik Patel bail, Pokemon, uber sweet ice-cream, France, Hardik Patel, Patel agitation, Gujarat quota, sedition cases, 9 months, surat lajpore jail, lajpore central jail, patidar protest

People exhausted by excessive Pokemon GO! hunting can get uber sweet ice-cream delivered to their door today, as gujarat Patidar protest leader Hardik Patel walked out before noon after nine months behind bars.

9 నెలల తరువాత హార్థిక్ పటేల్ కు స్వేచ్చావాయువు..

Posted: 07/15/2016 12:04 PM IST
Hardik patel released from jail gets hero s welcome

దేశంలో ఏ సామాజిక ఉద్యమాన్ని ఏవరు నడిపారో తెలియదు కానీ, తమ ఉద్యమాన్ని మాత్రం రాజకీయ పార్టీలు నడిపించలేదని పటేల్ వర్గం రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ అన్నారు. దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయిన.. తొమ్మిది నెలల తరువాత ఇవాళ జైలు నుంచి విడుదల అవ్వడంతోనే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తన సామాజిక వర్గం హక్కుల కోసం తనకు 56 అంగుళాల ఛాతి అవసరం లేదని అన్నాడు. పేద రైతుల కోసం, తమ రాష్ట్ర మహిళల సంక్షేమం కోసం తాను తన జాతి హక్కుల కోసం తాను నిత్యం పోరాడుతానని అన్నాడు.

సూరత్లోని లజ్‌పోర్‌ సెంట్రల్‌ జైలులో గత తొమ్మిది నెలలుగా కారాగారవాసాన్ని అనుభవించి ఇవాళ స్వేచ్ఛావాయువును పీల్చిన హార్థిక్ పటేల్ కు పటేల్ సామాజిక వర్గం నుంచి ఘనస్వాగతం లభించింది. అతడికి తిలకధారణ చేసి స్వాగతం పలికారు. సంకెళ్లు కలిగిన రైతుల దీనస్థితిని, ఛత్రపతి శివాజీ వేషాధారణ, పటేల్ మద్దతుదారులు తెల్లని టోపీలు ధరించి ఆయనకు స్వాగతం జైలు బయట స్వాగతం పలికారు. కాగా బెయిల్ లభించినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు అతడు 48 గంటల్లో గుజరాత్ వదిలి వెళ్లాల్సి ఉంది.

మెహసానా నగర ప్రవేశంపై రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరణ విధించడంతో ఆరు నెలల పాటు హార్థిక్ పటేల్ గుజరాత్ బయట ఉండనున్నాడు. కాగా గుజరాత్‌లో పటేళ్ల రిజర్వేషన్‌ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్‌కు... గతవారమే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అహ్మదాబాద్‌, సూరత్‌ల్లో నమోదైన దేశద్రోహం కేసుల్లో అతడికి బెయిల్‌ వచ్చింది. అయితే సూరత్‌లోనే నమోదైన మూడో కేసులో బెయిల్‌ లభించనందున.. బయటకు రావడం ఆలస్యమైంది. హార్ధిక్‌ పటేల్‌ విడుదల నేపథ్యంలో పటేల్‌ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇందులో పలు ర్యాలీల్లో హార్దిక్‌ కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంల గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీగా జనం పోటెత్తడంతో సూరత్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని రూట్లలో బస్సులను కూడా గుజరాత్ ఆర్టీసీ నిలిపివేసింది. గత ఏడాది జరిగిన అల్లర్లలో 30 బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ప్రస్తుతం సూరత్లో అప్రకటిత బంద్ వాతావరణం కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles