Vietnamese man killed by estranged wife who crushed his testicles

Vietnamese woman kills abusive husband by squeezing his balls

women crushes hubby testicles, Vietnamese man, Le Kim Khai, Phan Thi Kim Chuong, wife crushes husband balls, Vietna, domestic violence, suffocation

Le Kim Khai, 53, died of suffocation while on the way to the hospital after a fight broke out and 55-year-old Phan Thi Kim Chuong crushed his testicles for “about five minutes.”

పట్టరానిచోట పట్టుబిగించిన భార్య, ఐదు నిమిషాల్లో భర్త..

Posted: 07/15/2016 11:36 AM IST
Vietnamese woman kills abusive husband by squeezing his balls

ఆ మధ్య ఓ భారీకాయం వున్న భార్య కాలు జారీ అనుకోకుండా తన భర్తపై పడటంతో భర్త ప్రాణాలు అనంతవాయువులలో కలిసిన విషాధ వార్తను చదివాం. కానీ ఇక్కడ మాత్రం ఈ భార్య తన భర్త తనపై దాడి చేస్తున్నాడన్న కారణంతో అతడ్ని కిందపడేసి మరీ కోట్టి... అతను చావుబతుకుల మధ్య వున్నా పట్టించుకోకుండా భర్త ప్రాణాలు పోయేందుకు కారణమైంది. అయితే ఇందుకు ప్రధాన కారణం మాత్రం అమె భర్తను పట్టుకోరాని చోట పట్టుకుని దానిని అతను చచ్చేంతవరకు విడిచిపెట్టకపోవడమేనంటున్నారు వైద్యులు.

వియత్నాంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టుకోనిరాని చోట పట్టుకోవడంతో చెట్టంత మగాడు, మొగుడు కప్పుకూలాడు. కాగా భార్య భర్త వరిబిజాలను (వృషణాలను) గట్టిగా అదిమి పట్టుకోవడంతో ఆ భాద భరించలేక అమె భర్త లీ కిమ్ ఖాయ్ వాంతులు చేసుకుని మరీ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. బయటికి నుంచి ఇంటికి తిరిగొచ్చిన లీ కిమ్ తలుపు గడియ పెట్టివుండడం గమనించాడు. తలుపును గట్టిగా బాదినా అతడి భార్య పాన్ థీ కిమ్ చుయొంగ్, ఇద్దరు కూతుళ్లు పట్టించుకోలేదు.

దీంతో ఆగ్రహించిన లీ కిమ్ చేతి రంపంతో భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెను కొట్టాడు. భర్త నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు అతడి వృషణాలను పట్టుకుంది. అక్కడితో ఊరుకోకుండా భర్తను కిందపడేసి అతడి పొట్టపై కూర్చుని కదలకుండా చేసింది. అతడు వాంతులు చేసుకున్నా పట్టించుకోలేదు. అరుపులు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగెత్తికొచ్చి చుయొంగ్ చేతిలోంచి భర్తను విడిపించారు. అపస్మారక స్థితిలో పడివున్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే గతంలోనూ పలుమార్లు లీ కిమ్ తనను కొట్టాడని చుయొంగ్ వెల్లడించింది. హెచ్చరించేందుకే అతడి సున్నితావయవాలను పట్టుకున్నానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె వాపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women crushes hubby testicles  Vietnamese man  Le Kim Khai  Phan Thi Kim Chuong  

Other Articles