Ashok Khemka tops LLB Entrance Test-2016 Punjab University

Khemka wants to be lawyer tops entrance

Ashok Khemka, LLB Entrance Test-2016, Principal Secretary to Haryana Government, UILS Punjab, Punjab University

Ashok Khemka, Principal Secretary to Haryana Government, Science and Technology Department has topped in the LLB Entrance Test-2016, Punjab University which is a 3 year course.

నిజాయితీ ఐఎఎస్ అధికారి న్యాయవాది కల.. ఎందుకోసం..?

Posted: 07/15/2016 10:49 AM IST
Khemka wants to be lawyer tops entrance

హర్యానా రాష్ట్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కా దేశప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. ఒకనాటి రోజుల్లో ఈయన పేరును వాడుకుని ప్రభ్వుత్వ గద్దెను పార్టీలు అధిరోహించాయంటే కూడా అతిశయోక్తి కాదు. ఆయనే నిజాయితీ గల ఐఎఎస్ అధికారి. తన రమారమి 25 ఏళ్ల సర్వీసులో 46 బదిలీల వేటుకు గురైనా మొక్కవోని ధైర్యంతో దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని కృతనిశ్చయం తీసుకున్న అధికారి.

అయన వాదనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుత హర్యానా ప్రభుత్వం అయనకు తాఖీదులను అందించేందుకు రంగం సిద్దం చేసింది. దీనిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ స్పందిస్తూ.. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే తీసుకున్న నిర్ణయమని.. దానిని యధాతథంగా కొనసాగించామని చెప్పారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నింటీని అదేవిధంగా కోనసాగిస్తున్నారా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగించే పక్షంలో రాష్ట్రంలో బీజేపి ప్రభుత్వం ఎందుకన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఇక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఐఎఎస్ అధికారికి జారీ చేసిన తాఖీదులను బీజేపి ప్రభుత్వం గత నెల డిసెంబర్ మాసంలో ఎందుకు ఉపసంహరించుకుని ఊరట కలిగించిందన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక రాబర్ట్ వాద్రా కేసులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనలు వినేందుకు సమ్మతించగా, అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ప్రస్తుత బీజేపి ప్రభుత్వం నిజాయితీ గల అధికారికి శ్రీముఖాలు జారీ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ తాఖీదులన్నింటికీ తనకు తానే బదులు చెప్పాలనుకున్న ఖేమ్కా.. తానే స్వయంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించాలని పూనుకున్నారా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే సాధారణంగా ఐఎఎస్ అధికారి అంటే.. కోటికోకరికి అవకాశం లభిస్తుంది. అందులోనూ సీనియారిటీ పెరిగేకొద్ది వారికి సముచిత, సమున్నత పదవులు లభించడంతో వారి అదృష్ట రేఖ ఎక్కడికో తీసుకెళ్తుంది. కానీ అలాంటి ఐఎఎస్ అధికారి ఖేమ్కా.. గుంపులో గోవిందయ్యగా మారుతున్నారేంటి..? అదేనండి ఇప్పటికే అసంఖ్యాక మంది న్యాయవాదులు వున్న సమాజంలో ఆయన కూడా న్యాయశాస్త్రాన్ని అభ్యసించాలని అనుకోవడం ఎందుకన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఐఎఎస్ అధికారిగా ప్రజలకు ఆయన మేలు కలిగించలేకపోతున్నారన్న భాధ అయనలో నెలకోందా.? అందుకనే అయన ప్రజలకు న్యాయవాదిగా నిస్వార్థ సేవలను నిజాయితీగా అందించాలని అనుకుంటున్నారా. అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి. లేక ప్రభుత్వాలు తనపై జారీ చేస్తున్న తాఖీదుల నేపథ్యంలో ఏ న్యాయవాదిని అశ్రయించకుండా తనకు తానుగానే ఈ కేసులను వాదించుకునే సౌలభ్యం కోసమే తాను న్యాయశాస్త్రాన్ని అభ్యసించాలని అనుకుంటున్నారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashok Khemka  LLB  Haryana Government  Punjab University  

Other Articles