లాడెన్ పై షాకింగ్ కామెంట్లు | Boris Johnson says bin Laden addicted to pornography

Boris johnson says bin laden addicted to pornography

Boris Johnson says bin Laden Porn addicted, Boris Johnson bin Laden, bin Laden addicted to pornography

Boris Johnson says bin Laden addicted to pornography and Youth attracted because of Porn only.

లాడెన్ పై షాకింగ్ కామెంట్లు

Posted: 07/14/2016 10:51 AM IST
Boris johnson says bin laden addicted to pornography

అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ పై సంచలన ఆరోపణలు చేశారు ఇంగ్లాండ్ విదేశీ కార్యదర్శి బోరిస్ జాన్సన్. లాడెన్ ఓ  పోర్న్ అడిక్ట్ వ్యక్తి అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. లాడెన్ ను మట్టుబెట్టిన సమయంలో తలదాచుకున్న శిబిరం నుంచి పెద్ద ఎత్తున్న పోర్న్ సీడీలు, మాగ్జైన్ లు స్వాధీనం చేసుకున్నామని, అమెరికా దళాలు కూడా ఈ విషయాన్ని అప్పట్లో దృవీకరించాయని తెలిపారు. అంతేకాదు పోర్న్ కోసమే యువత ఐఎస్ఐఎస్ లో చేరుతున్నారని చెప్పారు.  

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ పై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు కూడా బోస్టన్‌, లాస్‌ వేగాస్, ఫ్లోరిడాల్లో లైంగిక దాడులకు, వేధింపులకు పాల్పడుతున్నట్లు అమెరికా భద్రతాధికారులు తమకు సమాచారం అందించారని వివరించాడు. ‘‘పట్టుబడ్డ జిహాదీల ల్యాప్‌ టాప్‌ ల నిండా పోర్న్ సినిమాలే ఉన్నాయని అధికారులు వెల్లడించారు కూడా. జీహాద్ అంటూ అవాకులు చవాకులు చెప్పే ఉగ్రవాదులు సైకోపాత్ లు’’ అని ఆయన అభివర్ణించారు. వీలైనంత త్వరగా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలని ఆయన సూచించారు.

లండన్ మాజీ మేయర్ అయిన బోరిస్ ను కొత్త ప్రధాని థెరిసా మే తన కేబినెట్ లో ఫారిన్ సెక్రటరీగా నియమించింది. ఇక పదవీ బాధ్యతలు అందుకున్న వెంటనే ఆయన ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో లాడెన్ పై ఈ వ్యాఖ్యలు చేశాడు. అన్నట్లు లాడెన్ నుంచి సేకరించిన పోర్న్ డేటాలో వీడియోలు, ఫోటోలు ఎక్కువగా ఉన్నవి సన్నీలియోన్ వే నంట!

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boris Johnson  bin Laden  Porn addict  

Other Articles