Three including ex-home guards arrested for extortion

Three former home guards nabbed for honey trapping extortion

adult web site, pilot trapped, rape case, homeguards pretended as crime branch police, hoe guards trapped piolt, home guards arrested, pilot, extortion case, home guard extortion case, pilot extortion case, latest india news

The gang, which includes female members trapped the pilot through a popular online dating site and extorted Rs 9.7 lakh.

సినీ డ్రామాను తలపించే రియల్ ఇన్సిడెంట్..!

Posted: 07/09/2016 01:12 PM IST
Three former home guards nabbed for honey trapping extortion

అచ్చంగా సినీడ్రామాను తలపించే షాట్. అయితే రియల్ లైఫ్ లో వక్రమార్గం పట్టిన ముగ్గరికి అది కామధేనువు, కల్పవల్లి. అదెలా అంటారా.. సినీమాల మాదిరిగా జరిగిన ఘటనలను రియల్ లైఫ్ లో అంతకన్నా చరురత, నైపుణ్యం ప్రదర్శించి బెరడీ కొట్టించే కొద్దీ అనుభవం పెంచుకుంటూ.. తమ కళను ప్రదర్శించారు ఈ ప్రబుద్దులు. అయితే ఎంతటి కళానైపుణ్యంతో రాణించినా.. కరుడు గట్టిన నేరగాళ్లకే తప్పని కటకటాలు తమకు తప్పవన్న విషయాన్ని మర్చిపోయారు ప్రబుద్దులు.

అల్లరి నరేష్ నటించిన బ్లేడ్ బాబ్జీ చిత్రంలోని ఓ సన్నివేశం గుర్తుందా..? బ్రహ్మనందానికి ఓ అమ్మాయిని ఎరగా వేసి.. అమ్మాయితో బ్రహ్మానందం గదికి వెళ్లగానే ఒకడు పోలిస్ లా మరోకడు అమె బాయ్ ఫ్రెండ్ లా.. మరొకడు అమె భర్తలా వచ్చి బ్రహ్మానందాన్ని వెర్రిపప్పను చేసి.. అందినకాడికి డబ్బు తీసుకుంటారు. సరిగ్గా అదే థియరీని ఫాలో అయిన ఓ ముగ్గురు మాజీ హోంగార్డులు.. మక్కీ టు మక్కీ అలా చేసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికి పైగా బురడీ కొట్టించారు. వీరి చేతిలో ఓ ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థలో పనిచేస్తున్న పైలట్ కూడా మోసపోయాడు. వారి పెట్టే బ్లాక్ మెయిలింగ్ టార్చర్ భరించలేక.. చివరాఖరున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు దొరికిపోయారు. అదికూడా అంతకుముందు ఫైలెట్ ఆ ప్రబుద్దులకు ఏకంగా పది లక్షల క్యాష్ ముట్టజెప్పాడట.

వివరాల్లోకి వెళ్తే.. పైలట్కు అడల్ట్ ఫ్రెండ్షిప్ వెబ్సైట్లో ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు. ఈ పరిచయం క్రమంగా పెరిగింది. దీంతో ఇద్దరు కలుసుకోవాలని అనుకున్నారు. రోహిణిలో ఓ కేఫ్లో ఇద్దరు కలుసుకున్నారు. పైలట్ ను తన గదికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో మరో మహిళలను కూడా పిక్ చేసుకుంది సదరు మహిళ. వీరిద్దరిని తన గదిలో కూర్చోబెట్టి.. తాను పక్క గదిలోకి వెళ్లింది. వీరిద్దరూ మాట్లాడుతున్న క్రమంలోనే అగదిలోకి ఊహించని అతిధులు రావడాన్ని చూసి పైలట్ కంగుతిన్నాడు.

వారు తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. అంతేకాదు తమను తాము క్రైం బ్రాంచ్ అధికారులుగా చెప్పుకున్నారు. మహిళలను రేప్ చేసినట్టు కేసు పెడతామని పైలట్ను బెదిరించారు. మహిళలను ఇద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో భయపడిన పైలట్ కేసు నుంచి తప్పించుకునేందుకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తొలుత 20 వేల రూపాయల నగదు ఇచ్చిన పైలట్ ఆ తర్వాత మరో లక్ష ముట్టజెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు మరోసారి బ్లాక్ మెయిల్ చేయడంతో మరో 9 లక్షలు ఇచ్చాడు.

ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోతుందని భావించిన పైలట్కు ఆ త్రయం మరిన్ని చికాకులు పెట్టింది. కొత్త డిమాండ్లు పెట్టి వేధించసాగారు. దీంతో విసిగిపోయిన పైలట్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కాల్స్ డేటా ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో మొత్తం మాస్టర్ ప్లాన్ వేసి నడిపించిన వ్యక్తి జితేందర్ సింగ్ మాజీ హోంగార్డు అని తేల్చిన పోలీసులు అతనికి నేరాలకు సహకరించిన మరో ఇ్దదరు సుందర్ లాల్, జితేందర్ లు కూడా మాజీ హోంగార్డులని తెలిపారు. ఈ గ్యాంగ్ తమ గాళ్ఫ్రెండ్స్ను ఎరగా వేసి దాదాపు 100 మందిని మోసగించినట్టు పోలీసుల విచారణలో తేలింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adult web site  pilot trapped  rape case  extortion case  

Other Articles