collage imposes fine on students if they talk mobile in classroom

Gundi collage imposes mobile phone fine in classrooms

mobile phone, Cellphone, Rs. 10 thousand fine, Class room, Guindy Engineering College, students

Gundi collage of engineering imposes fine of Rs, Ten Thousand, if they talk mobile phone in class room

హలో..! మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నారా..? అయితే జాగ్రత్తా..!

Posted: 07/09/2016 08:48 AM IST
Gundi collage imposes mobile phone fine in classrooms

మీ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా..? పాఠశాలలకు, కాలేజీలకు మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు.. కాబట్టి వాటిని ఇచ్చే తరుణంలో కాస్త జాగ్రత్త. ఎందుకంటే అవి వాడుతూ మీ పిల్లలు టీచర్లకు పట్టుబడితే.. ఇక మీకు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయురాలిని కలవాల్సిందే. అలా కాదు మా వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అందుకనే వాడికి సెల్ ఫోన్ ఇచ్చామని అంటున్నారా..? అయితే తరగతి గదుల్లో సెల్ ఫోన్ మాట్లాడితే.. మీ జేబులకు చిల్లులు పడటం ఖాయం. అదెలా అంటారా..?

తరగతి గదిలో సెల్‌ఫోన్‌లో మాట్లాడితే రూ.10వేలు జరిమానాగా విధించనున్నట్లు గిండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్రీయ అభివృద్ధిలో ఒక భాగంగా భావించపడే సామాజిక మాధ్యమాలు యువతరాన్ని ముఖ్యంగా విద్యార్థులను తన కబంధ హస్తాలతో బందీలను చేస్తున్నాయని చేతిలో పాఠ్య పుస్తకాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్ ఉండాల్సిందే. సెల్‌ఫోన్‌కు దాసులైన విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అంతేకాక వారి చెడు మార్గాలను అనుసరిస్తున్నట్లు పలు సర్వేల్లో తెలిసింది.

ఈ నేపథ్యంలో విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడానికి చదువుకునే సమయంలో వారి ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు పాఠశాల, కళాశాల నిర్వాహకులు పలు రకాల నిబంధనలు విధించాయి. గిండి ఇంజినీరింగ్ కళాశాలలో తరగతి గదుల్లో సెల్‌ఫోన్‌లు ఉపయోగించరాదని, ఒక వేళ మాట్లాడితే వారికి రూ.10వేలు జరిమానా విధిస్తామని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల నుండి ఈ నిబంధనకు ఆదరణ లభించిందని అన్నారు. ఎవరైనా పట్టుబడి జరిమానా చెల్లించినట్లయితే ఆ సొమ్మును పేద విద్యార్థుల ఫీజులకు ఉపయోగిస్తామన్నారు. వారంలో రెండు రోజులు విద్యార్థులకు దీనిపై కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mobile phone  Cellphone  Rs. 10 thousand fine  Class room  Guindy Engineering College  students  

Other Articles