Rat vs snake: Fiercely protective mother rodent fights off huge reptile after it snatches baby in its mouth

Mama rat saves baby from the jaws of a snake

Mama rat saves baby from the jaws of a snake, mother rat, baby rat, snake, fight, Animals, Trending news, viral video, trending video, social media, facebook,

The rodent refused to give up on her child - attacking the snake's tail to get the reptile to drop her offspring

ITEMVIDEOS: పాముకు పట్టపగలు చుక్కలు చూపిన మూషికం..

Posted: 07/05/2016 10:52 AM IST
Mama rat saves baby from the jaws of a snake

తన బిడ్డలు ప్రాణసంకటంలో వుంటే.. వారి తల్లులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడుతున్నారన్నడానికి ఇది మరో సజీవ సాక్ష్యం. దేవుడు సృష్టించిన జీవరాశులన్నింటిలో అందరికీ తెలిసిన పాములకు ఎలుకలు ప్రధాన అహారమని అందరికీ తెలిసిందే. అయితే ఆ విధానాన్ని కూడా తోసిరాజి, దేపుడే మా రాత ఇలా రాసాడు అని ఊరుకోకుండా.. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన బిడ్డను కాపాడుకుంది ఓ తల్లి మూషికం. పట్టపగలు ఓ సర్పానికి మూషిక రాజం చుక్కలు చూపింది.

తన ప్రాణాలు పోయినా పర్వాలేదు... బిడ్డ బతకాలని ఆ తల్లి మూషికం నిర్ణయించుకుంది. క్షణం కూడా అలోచించకుండా తనను సైతం కబళించివేసే ఓ సర్పరాజంతో పోరాడింది. ఇంగ్లండ్‌లో ఒక మూషికం జరిపిన పోరాటం అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. కన్నతల్లి ధైర్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక సర్పానికి ఆకలి వేసింది. అంతలోనే ఎలుక పిల్ల కనిపించింది. దాన్ని నోట కరుచుకుని మింగేందుకు ప్రయత్నించింది. అంతలోనే వెనుకనుంచి ఎవరో లాగుతున్నట్లు అనిపించింది. ఎంత గింజుకున్నా ముందుకు కదలలేకపోయింది.
 
పాము నోట్లో ఉన్న ఎలుక పిల్లను దాని తల్లి చూసింది. తన బిడ్డను కాపాడుకోవాలనుకుంది. అంతే పాము తోకను పట్టుకుని కొరకడం మొదలుపెట్టింది. పాము ముందుకు కదులుతుంటే...ఎలుక వెనక్కి లాగుతోంది. ఎంత ప్రయత్నించినా పాము ముందుకు వెళ్లలేకపోయింది. ఇక చేసేదిలేక పాము తన నోటిలో ఉన్న ఎలుక పిల్లను వదిలేసింది. తల్లి ఎలుక కూడా కొంచెం పట్టు సడలించింది. బతుకుజీవుడా అంటూ పాము పక్కన ఉన్న పొదల్లోకి దూరిపోయింది. ఎలుక తన పిల్లను తీసుకుని వెళ్లిపోయింది. మాతృ హృదయమంటే అదే కదా.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mother rat  baby rat  snake  fight  Animals  Trending news  viral video  

Other Articles